drinking warm water with empty stomach everyday

ఉదయాన్నే పరగడుపున వేడినీళ్లు తాగితే మీ శరీరంలో భయంకరమైన రోగాలు శాశ్వతంగా మాయం చేస్తుంది..warm water

ఉదయాన్నే పరగడుపున ఒకగ్లాసు వేడినీళ్ళు తాగితే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా. ఉదయం లేచిన దగ్గర నుండి శరీరం ఎన్నో పనులు నిర్వహిస్తుంది. ఇందులో చాలా పనులు మనకు తెలియను కూడా తెలియవు. ఎందుకంటే ఇవి మన శరీరం లోపల జరిగే ప్రక్రియలు. తిన్న ఆహారం జీర్ణంచేయడం, రక్తాన్ని తయారు చేయడం, అలాగే శరీరంలో ఉన్న విషవ్యర్థాలను, టాక్సిన్లు బయటకు పంపడం వంటి పనులు దాదాపు ప్రతి నిమిషం జరుగుతూనే ఉంటాయి. మనం పడుకునేటప్పుడు కూడా మన శరీరం లోపలినుండి తన పని తాను చేసుకుంటుంది. ఈ ప్రక్రియలన్నీ జరగడానికి కావలసినది నీళ్ళు. నీళ్ళ అవసరం మన శరీరానికి కావలసింత ఉంది. మన శరీరం 60%నీటితో నిండి ఉంటుంది. చిన్నా పెద్దా అన్ని అవయవాలు నీటితో తయారుచేయబడి ఉంటాయి.

 అందుకే శరీరంలో నీటిశాతం సరిపడా ఉండాలి. తగినంత నీళ్ళు లేకపోతే శరీరం లోపల ఇంజన్ లేని కార్లా తయారవుతుంది. అనేక రకాల వ్యాధులు రావడానికి నీళ్ళు తగినంత తాగకపోవడమే కారణం. మన అజ్ఞానం వల్లనో మారిన జీవనశైలి వల్లనో వస్తాయి. మనం చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే వీటినుండి బయటపడొచ్చు. అలాంటి వాటిలో ముఖ్యమైన అలవాటు మంచినీరు తాగడం. నీళ్ళు తాగడం సాధారణ అలవాటే కానీ రోజుకు రెండు, మూడుసార్లు వేడినీటిని తాగడంవలన శరీరాన్ని ఎన్నో రకాల వ్యాధులనుండి కాపాడుకోవచ్చు. ఉదయాన్నే వేడినీరు తాగడంవలన  శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలను అందివ్వొచ్చు.

 నీటిని మరిగించడం వలన నీటిలో ఉండే అశుద్ధం అంటే మలినాలు, సూక్ష్మ జీవులు నశించిపోతాయి. నీరు స్వచ్చంగా మారతాయి. వాటర్ ఫ్యురీఫైయర్ అనేది నీటిలోని ముఖ్యమైన మినరల్స్ నశింపచేస్తుంది. ఇలా తాగం అంత మంచిది కాదు. సాధ్యమైనంత ఇంట్లో ఉండే స్వచ్ఛమైన నీటిని గోరువెచ్చగా చేసుకుని తాగాలి. ఉదయాన్నే లేచిన వెంటనే, రాత్రి పడుకోవడానికి గంటముందు తాగితే సరిపోతుంది. ఇలా తాగుతూ ఉంటే శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. వేడినీరు తాగడంవలన శరీర ఉష్ణోగ్రత పెరిగి చెమటలు పడతాయి. చెమటలు వలన విషపదార్థాలు చెమటరూపంలో బయటకు పంపిస్తుంది. దానివలన శరీరం శుద్ధి అవుతుంది. ఈ నీటిలో అరచెక్క నిమ్మరసం కలుపుకుని తాగండి. దానివలన విటమిన్ సి కూడా లభిస్తుంది. 

శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మెటబాలిజం వేగవంతం అవుతుంది. దీనివలన మొండికొవ్వు కరిగి అధికబరువు సమస్య తగ్గుతుంది. జీర్ణవ్యవస్థలో సమస్యలు వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కడుపుబ్బరం, నొప్పి, జీర్ణం అవకపోవడం వలన  జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. వేడినీరు తాగడంవలన జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్దకం, గ్యాస్, కడుపుబ్బరం తగ్గుతుంది. గోరువెచ్చని నీటిని తాగడంవలన మలబద్దకం తగ్గి విరోచనం సాఫీగా అవుతుంది. జుట్టు పెరుగుదలకు, చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది. వేడినీరు తాగడంవలన జుట్టు బాగా పెరుగుతుంది. వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. నీళ్ళు తాగకపోవడం వలన జుట్టు పొడిబారి  చుండ్రు కూడా వస్తుంది. వేడినీటిని తాగడంవలన జుట్టు మెరవడమే కాకుండా ఒత్తుగా పెరుగుతుంది. శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. శరీరమంతా ఆరోగ్యంగా ఉంటుంది. 

మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

Leave a Comment

error: Content is protected !!