Dry ginger powder with honey benefits

పొద్దున్నే లేవగానే నీరసంగా ఉంటుందా?….. ఒక స్పూన్ ఈ పొడి తో తేనెను కలుపుకొని తాగండి నీరసం రమ్మన్నా రాదు

కొంతమందికి నిద్ర లేవగానే అంత హుషారుగా అనిపించదు. కొంచెం డల్ గా నీరసంగా ఉంటారు. దీనినే మార్నింగ్ సీక్ నెస్ అంటారు. వీళ్లలో పొట్టలో అసౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఎక్కువగా అందరికీ నోటిలోంచి పసర్లు లేదా పుల్లగా వస్తూ ఉంటాయి. నోటిలో అదొక రకంగా ఉండి పొద్దున్నే డల్ గా ఉంటారు. ఇటువంటి మార్నింగ్ సిక్ తగ్గించుకోవడానికి ఏదైనా ఉంటుందా అంటే ఉదయం తీసుకోవడానికి బదులుగా ముందు రోజు సాయంత్రం తీసుకుంటే మార్నింగ్ సీక్ నెస్ తగ్గించే విధంగా ఉంటాయి.

                        సొంటి. సొంటి అంటే అల్లం ముక్కను పాలలో నానబెట్టి బాగా ఎండబెట్టగా వచ్చిన దానిని సొంటి అంటారు. వీటిని మార్కెట్లో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. ఇటువంటి సొంటి కొమ్మలను తెచ్చుకొని ఎండలో ఎండబెట్టి మెత్తని పొడి లాగా చేసుకుని బాగా జల్లేడు పట్టుకుంటే వచ్చిన సన్నటి పొడిని స్టోర్ చేసుకోవాలి. ఇలా వచ్చిన సొంటి పొడి చిటికెడు తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఒక స్పూన్ తేనె కలిపి బాగా కలుపుకోవాలి. ఇలా సొంటి తేనె కలిపినా మిశ్రమాన్ని రాత్రి డిన్నర్ చేసే ముందు నాకేసి ఆ తరువాత భోజనం చేయాలి.

                          సాయంత్రం సమయంలో ఇలా తీసుకోవడం వల్ల మార్నింగ్ సిక్ నెస్ తగ్గుతుంది. ఈ సొంటి పొడిలో జీర్ణ ఎంజైమ్ లను, జీర్ణ రసాలను బాగా ఉత్పత్తి చేసే గుణం ఉంటుంది. ఇవి ఆకలిని ఎక్కువగా చేస్తాయి. ఆహారాలు పులియకుండా, నిల్వ ఉంచకుండా చేస్తాయి. అంతేకాకుండా జీర్ణ రసాలను బాగా రెగ్యులేట్ చేయడానికి కూడా సహాయపడుతుంది. అందువలన జీర్ణశక్తి పెరుగుతుంది. దీనివలన పసర్లు నిల్వ ఉండడం, పులవడం ఇవన్నీ మార్నింగ్ సిక్ నెస్ కు కారణం కావడం, తలనొప్పి వాంతులు వంటివి ఉండకుండా సొంటి చేస్తుంది.

                          సాయంత్రం సమయంలో సొంటి అలా తీసుకొని మీరు డిన్నర్ పూర్తి చేసేయండి. ఇది ఉదయానికి బాగా పనిచేస్తుంది. దీనివల్ల ఉదయం పూట ఫ్రీ గా ఉండడానికి బాగా పనిచేస్తుంది. ఉదయం లేవగానే మార్నింగ్ సిక్ నెస్ తగ్గడానికి, పసర్లు రాకుండా ఉండడానికి ఇంకొకటి ఏమిటంటే అది లేవగానే నోరు బుక్కలించుకొని నీళ్లు ఊసేసి గోరువెచ్చగా లేక దానికన్నా హాయిగా ఉండే మీరు తాగగలిగినంత వేడితో నీళ్లు ఒక గ్లాసు కావాలి. ఇలా వేడి నీళ్లు త్రాగేసరికి పోట్ట ఇరిటేషన్ మొత్తం బాగా తగ్గుతుంది. ఇలాంటివి కొన్ని ఫాలో అయితే మార్నింగ్ సిక్ నెస్ తగ్గుతుంది

Leave a Comment

error: Content is protected !!