Dusarateega mokka upayogalu medicinal plants

పిల్లలు లేనివారికి సంతానభాగ్యం కలిగించే తీగ

పొలాల్లో తరచూ కనిపించే ఈ మొక్క అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దీనిని దూసర తీగ , సిబ్బి తీగ, చీపిరి తీగ, సంస్కృతంలో పాపాల గరిడి అని పిలుస్తారు.ఈ చెట్టు ఆకులు దొండ ఆకులాగా ఉంటాయి. దీని శాస్త్రీయనామం కోక్యులస్ హెర్టికస్ కుటుంబానికి చెందినది. దీన్ని వాడడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ మొక్క వల్ల మనకు తెలియని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రోజుల్లో చాలామంది నరాల బలహీనతతో బాధపడుతూ ఉన్నారు. ఒంట్లో వేడి వలన అనేక ఆరోగ్యసమస్యలు ఎదుర్కొంటున్నారు.

 ఈ తీగ మొక్క వలన అటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఈ తీగ మొక్క పిల్లలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండాకాలం పిల్లలు ఎండలో ఎక్కువగా ఉండటం వల్ల శరీరం వేడిగా ఉంటుంది. దీనివల్ల మూత్రంలో మంట, ముక్కులోనుండి రక్తం కారడం జరుగుతుంది. పెద్దవారిలో కూడా బయట పని చేయడం, పొలాల్లో వ్యవసాయం చేసే వారికి ఎండ దెబ్బ తగిలి మలమూత్రంలో రక్తస్రావం జరుగుతుంది. 

ఇలా జరగకుండా ఉండడానికి ఈ ఆకులను కొన్ని తీసుకొని శుభ్రంచేసి కొద్దిగా నీటిలో వేసి రసం వచ్చేవరకు నలపాలి. ఇలా కలిపిన తర్వాత వ్యర్థాలను వేరుచేసి రసం తీసుకోవాలి. రసాన్ని పది నుండి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ రసం గట్టిపడి జెల్ లా తయారవుతుంది. అందులో కొంచెం పటికబెల్లం కానీ తాటి తాటి బెల్లం కానీ కలిపి తినాలి. ఇలా తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు అయినా తగ్గిపోతాయి. సంతానలేమి సమస్యలు ఉన్నవారు ఈ ఆకు రసం తీసుకోవడం వల్ల గర్భాశయ సమస్యలు తొలగి పోయినట్లు చెబుతున్నారు. 

నెలసరి సమస్యలు ఉన్నవారికి రెగ్యులర్ అయ్యేందుకు సహాయపడుతుంది. శరీర బరువు తగ్గి హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ లేకుండా జరుగుతుంది. ఈ ఆకు రసాన్ని 90 రోజుల వరకు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎండాకాలంలో వచ్చే వేడి కురుపులకు ఈఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అందుబాటులో లేనివారు ఎక్కడైనా ఆకులు దొరికినప్పుడు ఎక్కువగా తీసుకొని శుభ్రం చేసి నీడలో ఆరపెట్టుకోవాలి. తర్వాత ఈ ఆకులను పొడి చేసి ఒక డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని గోరువెచ్చని నీటిలో వేసి తాగడం తాగుతూ ఉండాలి.

 ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉన్న ఆరోగ్య సమస్యలు మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు.  చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులు, పాదాల వాపులు రావడం, ఉదయం లేవగానే పాదాల కింద పెట్టలేకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ సమస్యతో బాధపడడం జరుగుతుంది. ఈ ఆకుల్లో ఎక్కువగా క్యాల్షియం ఉంటుంది. ఈ ఆకుల రసం తరచూ తీసుకోవడం వల్ల కాళ్లలోని ఎముకలు కూడా గట్టిగా ఉంటాయి.

 ఇంటి చుట్టూ మొక్కలు ఉండడం వలన పాములు రావడం జరుగుతుంది పాములు రాకుండా ఉండడం కోసం గిరిజనులు ఈ ఆకులను ఇంటిముందు కడుతూ ఉంటారు. అలాగే ఈ చెట్టు వేరును ఇంటిముందు కట్టడం వలన క్రిమి కీటకాలు ఇంట్లోకి ప్రవేశించవని నమ్ముతారు.

1 thought on “పిల్లలు లేనివారికి సంతానభాగ్యం కలిగించే తీగ”

Leave a Comment

error: Content is protected !!