Early Heart Attack Symptoms

ఈ పది లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే గుండె పరీక్ష చేయించుకోండి

హాస్పిటల్స్ లో నమోదయ్యే 100 మరణాలలో కనీసం 30 మరణాలు గుండె నొప్పి వలన జరుగుతున్నాయంటే నమ్మగలరా?  అది కూడా 40 ఏళ్ల లోపు ఎక్కువగా గుండెజబ్బుల బారిన పడుతున్నారు. దీనికి ముఖ్య కారణం మనం ఎక్కువగా ఒత్తిడికి గురవడం, గుండె రక్తనాళాలలో బ్లాక్స్ ఏర్పడటం, అనారోగ్యకరమైన ఆహారం, వంశపారంపర్యంగా అనారోగ్య సమస్యలు రావడం, మధుమేహం, అధిక బరువు వంటివన్నీ కారణాలుగా ఉంటాయి. అయితే చాలామంది హఠాత్తుగా గుండెపోటు వలన మరణించారు అంటారు. కానీ గుండె నొప్పి రావడానికి కొన్ని నెలల ముందు నుంచి రకరకాల సూచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటన్నింటినీ దాటి  ఆఖరి దశలో మాత్రమే గుండె నొప్పి వస్తుంది. మనం సరిగ్గా గమనిస్తే మన శరీరంలో కొన్ని రకాల అనారోగ్య సూచనలు గుండె నొప్పికి కారణం అవ్వచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 చాలామందికి సరిగ్గా పొజిషన్లో పడుకోకపోవడం వలన, వెన్ను సమస్యలు ఉండడం వలన, మెడ, భుజం నరాలు నొప్పి పెడుతూ ఉంటాయి. అయితే కేవలం ఎడమ వైపు భుజం ఎక్కువగా నొప్పి పెడుతున్నా, మెడ నరాలు లాగుతున్నా తేడా తెలుస్తుంది. మెడ నొప్పి, భుజం నొప్పి సమస్య ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. మనం ఎక్కువగా గుండె నొప్పి అంటే గుండె చుట్టూ ఉన్న ప్రాంతంలో మాత్రమే నొప్పి వస్తుంది అనుకుంటాం. కానీ కొంతమందికి కడుపుకి కొంచెం పైన నొప్పి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలలో ఇలా ఉంటుంది. ఇలా కడుపులో నొప్పి రావడం గుండెవ్యాధికి కారణం కావచ్చు. గుండె పొట్టకి దగ్గరగా ఉంటుంది. కేవలం గుండెల్లోనే కాకుండా గుండెకి సరిగ్గా రక్తప్రసరణ జరగకపోవడం వలన శరీరంలో చాలా చోట్ల ఇలా నొప్పి తరచూ వస్తూ ఉంటే గుండె నొప్పికి సంబంధం కలిగి ఉంటాయి. అంతేకాకుండా వికారం, అజీర్ణం, గుండెల్లో మంట, లేదా కడుపు నొప్పి చాతిలో అసౌకర్యం ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి.

 శరీరంలోని ఇతర ప్రాంతాలలో నొప్పి అంటే పంటి నొప్పి, దగ్గు, ఎడమ చేయి లాగడం వంటివి తరచూ ఉంటే తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

 మెదడుకు రక్తప్రసరణ తగ్గిపోవటం వలన జ్ఞాపకశక్తి తగ్గుతుంది. దీనివలన మైకం, తల తిరగడం, ఏమీ అర్థం కాకపోవడం వంటివి జరుగుతుంటాయి. శరీరానికి రక్తంలో ఆక్సిజన్ తగ్గడం వలన ఏ పని చేసినా త్వరగా అలసిపోవడం ఊపిరి అందకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. వికారం లేదా అజీర్ణం కూడా కొంత మందిలో ఉంటుంది. చలి కాలంలో కూడా చెమటలు పట్టడం, ఏ శారీరకశ్రమ చేయకపోయినా చెమటలు పట్టడం వంటివి హార్ట్ లో ప్రాబ్లం ఉన్న వారికి ముందుగా కనిపించే కొన్ని రకాల సూచనలు. రక్తంలో ఆక్సిజన్ తగ్గటం వలన ఇలా చెమటలు పడతాయి.  

 గుండె దడ, ఆయాసం ఇది ఎక్కువగా ఉంటే వారిలో గుండె సమస్యలు ఉన్నాయేమో పరీక్షించడం మంచిది. కొంతమందిలో అధిక ఒత్తిడి, టెన్షన్ వలన కూడా గుండెదడ, ఆయాసం ఉంటాయి. అయితే అది ఎందువలన వస్తుందో కనుక్కోవడం మంచిది.

గుండె సమస్యలు ఉన్న వారిలో శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరా జరగదు. ఇలాంటి సమయంలో శ్వాస ఆడకపోవటం కాళ్లు చేతులు చల్లబడటం వంటివి తరచుగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు మీకు తరచూ కనిపిస్తున్నా, ఇందులో కొన్ని లక్షణాలు ఉన్నా తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి. డాక్టర్ పరీక్షించి ఏ సమస్య లేదు అంటే పరవాలేదు. గుండెకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ముందుగా చికిత్స తీసుకొని ప్రాణాలకు ప్రమాదం లేకుండా బయట పడవచ్చు.

Leave a Comment

error: Content is protected !!