ఈ మధ్య కాలంలో జుట్టు లేదా చర్మంపై ఏవైనా ప్రోడక్ట్ వాడాలంటే వాటిలో ఉండే రసాయనాలు గురించి భయపడవలసి వస్తుంది. అలాగని బిజీ లైఫ్లో రోజు కుంకుడుకాయలు వంటి వాటితో తల స్నానం చేయడం కష్టమైన పని. అందుకే అందరూ షాంపూలతో అలవాటు పడిపోయారు. అయితే ఈ షాంపూలలో ఉండే రసాయనాలు జుట్టు కుదుళ్లను బలహీనం చేసి జుట్టు రాలేందుకు కారణమవుతుంటాయి. అందుకే షాంపూను నేరుగా తలకు అప్లై చేయకుండా ఈ విధంగా రాస్తే జుట్టుకు ఎటువంటి హాని జరగదు. షాంపూలను తలకు ఎలా ఉపయోగించాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక శుభ్రమైన గిన్నెలో మీ తలకు సరిపడా షాంపూ తీసుకోండి. అయితే ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు వేసుకొని దానిలో ఒక గ్లాసు నీటిని వెయ్యండి. ఈ రెండింటినీ బాగా కలపాలి. దీనిలో ఒక స్పూన్ కాఫీ పౌడర్ కూడా వేసుకోవాలి. కాఫీ పౌడర్ తో పేరుకున్న జిడ్డును తొలగించి జుట్టు నల్లగా ఉండేందుకు సహాయపడుతుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు జుట్టు రాలడాన్ని ఎదుర్కుంటుంది.
NCBI అధ్యయనం ప్రకారం, DHT జుట్టు కుదుళ్లను కుదించేలా చేస్తుంది. కాఫీ మీ జుట్టు ఆకృతిని మెరుగుపరుస్తుంది. ఇది తల చర్మానికి రక్త ప్రసరణను పెంచుతుంది. తలను డిటాక్సిఫై చేయడానికి కాఫీ చాలా బాగుంది. తెల్లజుట్టు సమస్య ఉన్నవారికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఈ మిశ్రమంలో అలోవెరా జెల్ కూడా వేసుకోవాలి.
ఒక స్పూన షాంపూ, ఒక స్పూన్ అలోవెరా జెల్ కలుపుకోవాలి. అలొవెరా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించి జుట్టు మృదువుగా మారేందుకు సహకరిస్తుంది. జుట్టు సమస్యలు తగ్గడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపి ఎప్పుడైతే తలస్నానానికి వెళ్తామో అప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి. ఇందులో షాంపు ఉండడం వల్ల మరింత షాంపూ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మీరు తలస్నానం చేసిన ప్రతి సారి ఈ టిప్స్ పాటిస్తే జుట్టు మృదువుగా నల్లగా, పొడవుగా ఉంటుంది. జుట్టు పొడవుగా పెరగడానికి కావలసిన రక్త ప్రసరణ మెరుగవుతుంది. జుట్టు బలంగా ఉండేందుకు , పట్టుకుచ్చులా మెరిసేందుకు కూడా ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది.