దసరా నవరాత్రులు చివరిదశకు వచ్చేస్తున్నాయి. దశమి రోజుతో అమ్మవారి నవరాత్రులు ముగిసిపోతాయి. అయితే ఈ నవరాత్రులు ముగిసేలోపు ఇప్పుడు చెప్పబోయే 5 వస్తువులను ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే అనుకున్న పనులు జరగకపోయినా, జరిగిన సరైన ఫలితాలు పొందలేకపోతున్నాం బాధ వాడేవారు ఇప్పుడు చెప్పబోయే ఐదింటిలో కనీసం ఒక్కటైనా ఇంటికి తెచ్చి పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు అని పండితులు చెబుతున్నారు.
ధనప్రాప్తి లేక ఇబ్బంది పడుతున్నా, ధనం లభించినా అది ఇంట్లో నిలవక బాధపడుతున్నా, ఆరోగ్యం, సంపద కోసం ఈ 5 వస్తువులలో ఏదో ఒకటి తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. ఆరోగ్య, సంతాన, ఐశ్వర్యాభివృద్ధి కోసం ఈ వస్తువులు చాలా బాగా పనిచేస్తాయి.
ఆ 5 వస్తువులు అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనవి. అవి ఇంట్లో ఉండటం వల్ల అమ్మవారి దయ కలిగి శుభాలు కలగడంతో పాటు ఐశ్వర్య వృద్ధి కూడా జరుగుతుంది. అందులో మొదటి వస్తువు గవ్వలు. గవ్వలు సముద్రం నుండి ఉద్భవించాయి. అమ్మవారు కూడా సముద్ర తనయ కనుక గవ్వలు అంటే లక్ష్మీ దేవి అమ్మవారికి చాలా ఇష్టం. పూర్వకాలంలో ఎవరి దగ్గర అయితే గవ్వలు ఎక్కువగా ఉంటాయో వారిని ధనికులుగా భావించేవారు అంట.
గవ్వలను లక్ష్మీదేవికి ప్రతిబింబంగా భావిస్తారు. గవ్వలు ఉన్నచోట లక్ష్మీదేవి ఉంటుందని వారు కోటీశ్వరులు అవుతారు అని నమ్ముతారు. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో గవ్వలు అనేవి తెచ్చి పెట్టుకోవాలి. అందుకే 5 గవ్వలను అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజించి వాటిని మనం పెట్టే చోట పెట్టుకోవడం వల్ల ధనాభివృద్ధి జరుగుతుందని నమ్ముతారు.
తర్వాత వస్తువు శంఖం. శంఖాలలో రెండు రకాలు దొరుకుతాయి. ఒకటి గోమతి శంఖం , 2 దక్షిణామూర్తి శంఖం. రెండింటిలో ఏది దొరికినా తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. ఇవి దొరికినప్పుడు తెచ్చి ఇంట్లో పెట్టుకుని పూజించాలి. ఇలా పెట్టుకోవడం వలన ధనం ఆకర్షింపబడుతుంది అని నమ్ముతారు. తరువాత గురువింద గింజలు.
గురువింద గింజలు 11 తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించి తర్వాత ధనము ఉండే చోట పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుందని పెద్దల నమ్మకం. నాలుగో వస్తువు అమ్మవారి పాదుకలు. ఇవి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన వస్తువు అని అమ్మవారి పాదుకలు ఎటువైపు అయితే ఉన్నాయో అటు ధన లాభం ఉంటుందని చెబుతారు. పాదుకలు ఉన్నచోట అమ్మవారు నడయాడతారని నమ్మకం.
ఇక చివరి వస్తువు శ్రీ యంత్రం. శ్రీ యంత్రం ఇంట్లో ఉంటే ఇంట్లో ఉండే సమస్యలు తొలగి ధన లాభం, ఆరోగ్య వృద్ధి, ఉద్యోగంలో నిలకడ, వ్యక్తిగత జీవితంలో సమస్యలు అన్ని తొలగిపోతాయి. అందుకే వీటిలో ఏదైనా వస్తువును తెచ్చి అమ్మవారి దగ్గర పూజ చేసి తర్వాత దానం దాచుకునే చోటు పెట్టుకోవాలి. వీలైతే అన్ని తెచ్చుకోవచ్చు లేదా ఏదైనా ఒక వస్తువుతెచ్చి పెట్టుకోవడం మంచిది.