eat this for 7 days for healthy life

పరగడుపున 7రోజులు తింటే అనేక చర్మ,ఆరోగ్య సమస్యలు తొలగిపోయే రెండు పదార్థాలు

 కల్తీ ఆహారం, సరైన వ్యాయామం లేని జీవనశైలి కారణంగా రోగనిరోధక శక్తి కుంటుపడి అనేక రోగాలు  బారినపడుతున్నారు. సహజంగా రోగనిరోధక శక్తిని పెంచుకునే చాలా పదార్థాలు మన వంటింట్లోనే ఉంటాయి. అందులోనివే వెల్లుల్లి, తేనె. అలసట నిస్సత్తువ కమ్ముకుని ఏ పనీ చెయ్యాలనిపించకపోతే ఈ చిట్కా వారికోసమే.  వెల్లుల్లిలో ఉండే రోగనిరోధక శక్తి ని పెంచే లక్షణాలు అధికం. రోగనిరోధక శక్తి లేకపోతే ఆరోగ్యం చిన్నచిన్న వాటికే దెబ్బతింటుంది. వెల్లుల్లిని ఇష్టపడనివారు కూడా ఈ చిట్కా చూసి వెల్లుల్లిని తినడం మొదలుపెడతారు. తేనె సహజయాంటీ బయొటిక్గా పనిచేస్తుంది. అలాగే శక్తిని అందిస్తుంది. తేనె సర్వరోగనివారిణి. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి.

వెల్లుల్లిని మూడు పెద్ద రెబ్బలు తీసుకుని పైన పొర తీసేయాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలు చేసి రెండు చెంచాల తేనెలో నానబెట్టాలి. దొరికితే ఆర్గానిక్ తేనె వాడండి. ఈ మిశ్రమాన్ని రాత్రి నానబెట్టి ఉదయం పరగడుపున తింటే   ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దీనివలన ఇమ్యూనిటి పెరిగి ఎటువంటి ఇన్పెక్షన్లు రాకుండా చేస్తుంది. ధమనుల్లో ఏర్పడే రక్తం గడ్డలను తొలగించి గుండె జబ్బులను దూరంచేస్తాయి. వెల్లుల్లిలోని యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు వాపులు, నొప్పులను తగ్గిస్తాయి. గొంతు నొప్పులను, ఇన్ఫెక్షన్లు, వాపులను తగ్గిస్తాయి. జలుబు, దగ్గు వస్తే వెంటనే తగ్గవు. ఈ మిశ్రమాన్ని తినడంవలన అవి త్వరగా తగ్గిపోతాయి. శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపి శరీరంలోపల శుభ్రంచేస్తుంది.

 శరీరంలో అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించి అధికబరువును కరిగిస్తాయి. ఈ రెండింటి మిశ్రమంలో పోషకాలు అధికం. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడంవలన సొరియాసిస్ లాంటి చర్మసమస్యలు తగ్గిస్తుంది. చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా మార్చుతుంది. తేనెలో అనేక ఫాలీపినాల్స్ ఉంటాయి. అల్లిసిన్, అల్లిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి.ఇవన్నీ వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం చేస్తాయి. ముడతలు, మచ్చలు తగ్గించి ముఖాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయపడతాయి. ఈ మిశ్రమాన్ని నేరుగా చర్మంపై కూడా అప్లై చేయవచ్చు. యాంటిఫంగల్,యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అనేక ఇన్ఫెక్షన్లు, రుగ్మతలను దూరం చేస్తుంది. శరీరంలో ఆహారం, నీటి ద్వారా చొరబడే అనేక బాక్టీరియా, ఫంగస్ల నుండి రక్షణ ఇస్తుంది. తలలోని చర్మాన్ని ఆరోగ్యవంతం చేస్తుంది. ఇలాంటి సహజంగా దొరికే ప్రయోజనాలను పొందడానికి ఈ చిట్కా పాటించిచూడండి

Leave a Comment

error: Content is protected !!