శరీరంలో ఐరన్ తగ్గడంవలన రక్తహీనత , ఒళ్ళునొప్పులు వంటి సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించడానికి మందులు అందుబాటులో ఉన్నా వీలైనంత సహజంగా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. దాని కోసం ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే శరీరానికి కావలసినంత ఐరన్ లోపం తగ్గి రక్తహీనత సమస్యలు తొలగిపోతాయి. దాని కోసం కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.
మనకు కావలసిన పదార్థాలు వాల్ నట్స్, నువ్వులు ,బెల్లం, దేశవాళి నెయ్యి. మొదట వాల్ నట్స్ ని ఒక గుప్పెడు తీసుకోవాలి. దీనిలో ఒక హండ్రెడ్ గ్రామ్ నువ్వులు వేయండి. కావాలంటే నల్ల నువ్వులు లేదా తెల్లనువ్వులు ఏదైనా వాడుకోవచ్చు.అలాగే సరిపడా కొంచెం బెల్లం వేయాలి. దీంట్లో పంచదార లేదా పటికబెల్లం వాడకూడదు. బెల్లంలో ఉండే ఐరన్ శరీరంలో రక్తహీనత సమస్యను తగ్గించడం ద్వారా చాలా బాగా సహాయపడుతుంది. నువ్వులు, వాల్నట్స్ కూడా సమస్యలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి.
వీటిని మిక్సీలో వేసి మెత్తని పౌడర్ లా చేసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ నెయ్యి వేసి ఉండలు చుట్టుకోవాలి. ఈ ఉండ రోజూ ఒకటి తినడం వలన ఐరన్ సమస్య తగ్గుతుంది. ఇందులో వేసిన బెల్లం, వాల్నట్, నువ్వులు మంచి రుచిని ఇవ్వడంతోపాటు పిల్లలు మారాం చేయకుండా తినేస్తారు. డయాబెటిస్ ఉన్నవారు బెల్లం లేకుండా చేసుకొని తినవచ్చు. తర్వాత చిట్కా ఎండు అంజీర్ తీసుకోవాలి. ఎండు అంజీర్ తీసుకని కొన్ని పాలలో వేసి మరగబెట్టాలి. ఈ పాలను తాగేసి అంజీర్ నమిలి తినడం వలన శరీరంలో ఐరన్ శాతం పెరుగుతుంది.
అంతేకాకుండా ఇలా తాగడం వలన శరీరంలో క్యాల్షియం మరిన్ని ఖనిజాలు అందడంతో ఆరోగ్యంగా ఉంటారు. రక్తహీనత, కీళ్ల నొప్పులు, నడుంనొప్పి లాంటి సమస్యలకి కిస్మిస్ నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగి కిస్మిస్ తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. మన పురాతన కాలం నుండి నాగులచవితికి చేసే చిమ్మిలి రక్తహీనత సమస్యలు తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతాయి. ఇప్పుడు చెప్పిన ఆహారాలను మీ దినచర్యలో భాగం చేసుకొని ఇలా కనీసం నెలరోజులు పాటు తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది.