జామాకులు చిన్నప్పుడు లేత ఆకుల్లో చింతపండు ,ఉప్పు పెట్టుకుని కిళ్ళీలా తినడం తప్ప వాటి ఆరోగ్య ప్రయోజనాలు పెద్దగా ఎవరికీ తెలీదు. పేదవాళ్ళ ఆపిల్గా చెప్పుకునే జామకాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అంతకుమించిన ఆరోగ్య ప్రయోజనాలను జామ ఆకుల నుండి పొందవచ్చు. అనారోగ్య సమస్యలను దూరంచేసే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనివలన దగ్గు, జలుబు, చిగుళ్ల ఇన్ఫెక్షన్, నోటిపూత, పంటినొప్పిలాంటి ఎన్నో సమస్యలను దూరంచేస్తుంది. జామ ఆకుల్లో విటమిన్ సి అధికంగా ఉండడంవలన ఇమ్యునిటీని పెంచుతుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
అజీర్తి తో బాధపడేవారికి జామ ఆకుల కషాయం మంచి ఔషధం. వాంతులు, విరేచనాలతో బాధపడేవారు జామాకులతో చేసిన టీ తాగితే మంచిది. ఇందులో అధికంగా ఉండే ఫైబర్, పొటాషియం అజీర్తి తగ్గించి వాంతులు, విరేచనాలు తగ్గడానికి సహాయపడుతాయి. జామాకుల్లో క్వర్సిటిన్, ఫ్లవనాల్, ఫ్లెవనాయిడ్స్ ఉన్నందున అనారోగ్యం బారిన పడకుండా కాపాడతాయి. భోజనం తిన్న తర్వాత ఒక కప్పు జామాకుల టీ తాగితే మధుమేహానికి సంబంధించిన అన్ని సమస్యల నుండి బయటపడొచ్చు. మధుమేహ రోగులకు రక్తంలోని చక్కెర లెవల్స్ అదుపులో పెడుతుంది.
జామాకులను నీటిలో వేసి మరగబెట్టి ఆ నీటిని తాగడమే. రుచిలో కొంచెం వగరుగా ఉన్నా ఆరోగ్యాన్ని రక్షించడంలో అగ్రగామి మరి. నెలసరి సమయంలో స్త్రీలు పొత్తికడుపునొప్పితో బాధపడుతుంటే జామ ఆకుల రసం పనిచేస్తుంది. లేదా టీలా తీసుకున్నా మంచిదే. జామ ఆకుల్లో ఫైబర్ కంటెంట్ వలన అరుగుదల మెరుగుపడుతుంది. బాడీ డీహైడ్రేషన్ నుండి రక్షిస్తుంది. కాన్సర్ రాకుండా ఉండటానికి జామాకుల కషాయం తాగుతూ ఉండాలి.
కాన్సర్ ట్రీట్మెంట్ వలన వచ్చే దుష్ప్రభావాలు నుండి రక్షించే లక్షణాలు అధికం. చర్మంపై ఏర్పడే మచ్చలు, నల్లబడడం, మృతకణాలు తొలగించడంలో జామాకుల పేస్ట్ మంచి ఫలితాలను ఇస్తుంది. రసాయనాలు లేని సహజ స్క్రబ్ లా వాడుతూ ఉంటే చర్మంపై ఉన్న కాలుష్యం వలన వచ్చిన సమస్యలు తగ్గిస్తుంది. చర్మానికి కావలసిన పోషకాలు అందిస్తుంది.
జామాకులతో చేసిన టీ వలన త్వరగా ఆకలి వేయక కేలరీలు లేని పోషకాలు అందడంతో త్వరగా బరువు తగ్గొచ్చు. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభించి చెడుకొవ్వును తగ్గించి మంచి కొవ్వు ను పెరిగేలా చేస్తాయి. దీనివలన గుండెల్లో ఏర్పడే బ్లాక్స్ ను తొలగిస్తాయి. జామాకులు టాక్సిన్లను తగ్గించి, హైబి.పీ నుండి రక్షణ కల్పిస్తాయి.