1Effective 1Day Challenge Skin Whitening at Home

రూపాయి ఖర్చులేకుండా వారానికి ఒకసారి మాత్రమే వాడాల్సిన బాతింగ్ క్రీం

బ్యూటీ టిప్స్ ఏవైనా ముఖానికి లేదా కాళ్లు, చేతుల మెరుపు కోసం మాత్రమే అందుబాటులో ఉంటాయి. కానీ బాడీ మొత్తం తెల్లగా అవడానికి ఎటువంటి టిప్స్ లేవు. మన పురాతన నలుగుపిండి మాత్రమే ఎక్కువగా మొత్తం శరీరానికి ఉపయోగిస్తుంటాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత టైం పెట్టలేనివారు ఈజీగా ఉండే చిక్కాల కోసం ఎదురు చూస్తున్నారు.  

మనం ఈరోజు అలాంటి ఒక చిట్కా గురించి తెలుసుకుందాం. దాని కోసం మనం కావలసిన పదార్థాలు రెండు టేబుల్ స్పూన్ల బియ్యం నానబెట్టుకోవాలి. ఒక రాత్రంతా నానిన తర్వాత ఇవి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత సోప్ బేస్  తీసుకోవాలి. ఇది మార్కెట్లో దొరుకుతుంది లేదంటే అన్ని ఆన్లైన్ షాపింగ్ సైట్లో ఉంటాయి.

 అలా కాదు అంటే డవ్ లేదా పియర్స్ తీసుకొని వాటిని రెండు చెంచాలకు వచ్చేలా తురుముకోవాలి. తర్వాత బియ్యం పేస్ట్ను వడకట్టి  రవ్వలా ఉండేదాన్ని పక్కకు పెట్టుకోవాలి. వడగట్టుకున్న నీళ్లు స్టవ్పై పెట్టుకొని దగ్గరికి అయ్యేంతవరకు తిప్పుతూ ఉండాలి. ఈ నీళ్లు దోశ పిండిలా తయారు చేయాలి. తర్వాత తురుముకున్న సబ్బు  బేస్ను స్టౌపై ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు పెట్టి ఈ తురుమును ఒక చిన్న గిన్నెలో పెట్టి డబుల్ బాయిలింగ్ పద్ధతి లో వేడి చేయాలి. 

ఇలా వేడి చేయగా అది కరిగి లిక్విడ్ ఫామ్ లోకి రావాలి. తరువాత దోశ పిండిలా తయారైన బియ్యం నీళ్లు ఈ సబ్బు బేస్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అలోవెరా జెల్ వేసుకోవాలి. ఇది వేసుకోవడం వలన చర్మానికి ఎటువంటి దద్దుర్లు, దురదలు రాకుండా అడ్డుకుంటుంది. బియ్యం వల్ల లేదా సబ్బు వలన ఇన్ఫెక్షన్ ఉన్నవారు అలోవెరా జెల్ తప్పకుండా వాడాలి. 

లేకపోతే స్కిప్ చేసిన ప్రాబ్లం ఏమి లేదు. తర్వాత ఈ మిశ్రమంతో శరీరాన్ని బాగా రుద్దాలి. ఇది పూర్తిగా నురగతో ఉంటుంది. దీనితో స్క్రబ్ చేసిన వెంటనే మంచి ఫలితాన్ని చూపిస్తుంది. ఇలా వారానికి ఒకసారి క్రమం తప్పకుండా వాడుతుంటే మంచి చర్మ రంగును పొందవచ్చు. ఇది ఐదేళ్ల పైన పిల్లలకు కూడా వాడవచ్చు.

Leave a Comment

error: Content is protected !!