effective remedies for migraine

మందులేని మైగ్రేన్ జబ్బుకు అద్భుతమైన చిట్కాలు

ఆడుతూ పాడుతూ పని చేస్తున్నప్పుడు, అకస్మాత్తుగా తలను బాదుతున్నట్టు, తలలోపలి నరాలను మెలిపెడుతున్నట్టు చేస్తున్న అని మీద ఏకాగ్రత లేకుండా ఇక సాధ్యం కాకుండా ఒకచోట తలపట్టుకుని కూలబడటం ఇలా జరిగితే ఏ మెడికల్ స్టోర్ కో వెళ్లి పెయిన్ కిల్లర్ తెచ్చుకుని మింగి అప్పటికి తాత్కాలిక ఉపశమనం పొందుతూ  కాలం గడిపేసేవాళ్ళు బోలేడుమంది. అయితే చాలామందికి ఇలా వచ్చి పోయే తలనొప్పులు గూర్చి పూర్తిగా తెలియదు. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. తీరా సమస్య జటిలం అయ్యాక హాస్పిటల్ లో డబ్బులు కుప్పగా పోయడం మనుషుల అలవాటుగా మారిపోయింది. అందుకే తరచుగా వచ్చిపోయే తలనొప్పులు గూర్చి ముఖ్యంగా తలలో ఒకవైపు మాత్రమే వచ్చే వాటి గూర్చి నిర్లక్ష్యం చేయకుండా ఆ సమస్యలు కారణాలు, ఒంటి పార్శ్వ తలనొప్పి లేదా మైగ్రేన్ లక్షణాలు, మైగ్రేన్ సమస్యకు జాగ్రత్తలు నివారణోపాయాలు ఒకసారి మీకోసం.

మైగ్రేన్ సమస్య

తలలో రక్తనాళాలు ఒత్తిడికి లోనైనపుడు ఆ రక్తనాళాలు వాపుకు గురికావడం వల్ల తలలో ఆ రక్తనాళాలు ఉన్న భాగం అంతా విపరీతమైన నొప్పికి గురవుతుంది. దీన్ని పార్శ్వపు నొప్పి లేదా మైగ్రేన్ అని పిలుస్తారు. ఈ మైగ్రేన్ యెల్లపుడూ ఉండదు, అలాగని రాకుండానూ ఉండదు. మందు లేని జబ్బు గా దీన్ని పేర్కొనవచ్చు. ఇది మగవాళ్ళలో కంటే మహిళల్లో ఎక్కువగా వస్తుంది. 

తరచుగా వస్తూ, పోతూ ఉండటం, వాంతులు కావడం లేదా వాంతి వస్తున్నట్టు అనిపించడం, చిరాకు, కోపం,అసహనం, వెలుతురులో ఉండాలని అనిపించకపోవడం,  శబ్దాలకు చిరాకుపడటం, కోపం త్వరగా రావడం, ఒంటరిగా ప్రశాంతంగా ఉండాలని అనిపించడం.ప్రయాణాలు పడకపోవడం.  ఇలాంటివి ఎన్నో లక్షణాలు మైగ్రేన్ సమస్యలో ఎదురవుతాయి.

కారణాలు

మైగ్రేన్ సమస్యకు మొదటి కారణం మానసిక ఒత్తిడి అని చెప్పవచ్చు. అలాగే అతిగా ఆలోచన చేయడం అనవసర విషయాలను గూర్చి ఎక్కువ ఆందోళన పడటం కూడా మైగ్రేన్ సమస్యకు దారితీస్తుంది.

చాలా మందిలో రాత్రిపూట ఎక్కువ మేలుకోవడం వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. ఈసమస్య వల్ల తొందరగా డిప్రెషన్ కు గురి కావడం, కూడా మైగ్రేన్ కు దారి తీస్తుంది.

అధికంగా ప్రయాణాలు చేసేవారిలో మైగ్రేన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయాణ బడలిక ఇందుకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల సమస్యల వల్ల మైగ్రేన్ కు గురయ్యే అవకాశాలు ఎక్కువ.  పీరియడ్స్ రావడానికి ముందు లేదా పీరియడ్స్ అయిపోయిన తరువాత మైగ్రేన్ రావచ్చు. 

గర్భాటారణ సమస్యలో కలిగే ఒత్తిడి మరియు మెనోపాజ్ లోకి అడుగుపెట్టినవారి హార్మోన్ల అసమతుల్యత వల్ల మైగ్రేన్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

జాగ్రత్తలు

మైగ్రేన్ అనేది మానసిక వత్తిడి వల్ల వచ్చే సమస్య కాబట్టి మందులతో తగ్గదు. మన ఆరోగ్యం గూర్చి మనం తీసుకునే జాగ్రత్తలే మనకు గొప్ప ఔషధం. 

మానసిక ఒత్తిడిని జయించడానికి యోగ, ప్రాణాయామం, ధ్యానం,  వంటివి చేయడం వల్ల సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. 

తలలో నరాలకు ఎక్కువ ఇబ్బంది ఉండకూడదు. ప్రశాంతమైన వాతావరణంలో  ఎలాంటి అలికిడి లేని ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకోవడం మంచిది.

తలలో నరాల ఉపశమనం కు గోరువెచ్చని నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల నూనె కుదుళ్లలో ఇంకి నరాలు రిలాక్స్ అవుతాయి.

చివరగా….

మైగ్రేన్ ఎంత చిన్న విషయమో, నిర్లక్ష్యం చేస్తే చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది కాబట్టి అనవసరమైన విషయాలను పట్టించుకోకపోవడమే ఉత్తమైన మార్గం.

1 thought on “మందులేని మైగ్రేన్ జబ్బుకు అద్భుతమైన చిట్కాలు”

Leave a Comment

error: Content is protected !!