రోజూ మనం తినే తిండి, తాగేవి చేసేపని నుంచి మనం బరువు పెరుగుతామని మనకు తెలుసు. తెలిసినా ఏమీ చెయ్యలేం. మనం ఏవేవో కొన్ని ప్రయత్నాలు చేసి కొన్నిరోజులు తర్వాత ఫలితం రాలేదని నిరుత్సాహ పడి మానేస్తూ ఉంటాం. అలాంటివే మంచినీళ్ళు తాగడం, రాత్రుళ్ళు భోజనం మానేయడం వరకూ. నడక, వ్యాయామంలాంటివి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే డ్రింక్ అలాంటి భయం తొలగించి చాలా తక్కువ సమయంలోనే మంచి ఫలితాలు ఇస్తుంది. అంతేకాకుండా ఎక్స్ట్రా ఫ్యాట్ కరిగిస్తుంది.
దీనికోసం మనం తీసుకోవలసింది నాలుగే నాలుగు పదార్థాలు. ఒక గిన్నెలో గ్లాసున్నర నీళ్ళు వేసి మరిగించాలి. మీకు ఒకరోజుకి సరిపడా కావాలంటే ఒకేసారి ఒక లీటర్ నీటితో చేసుకోవాలి. అందులో మూడు బిర్యానీ ఆకులు వేయాలి. బిర్యాని ఆకు బిర్యానీ లోనే వాడతారు అనుకుంటారు కానీ బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది. వీటిలో ఔషధగుణాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఇవి ఇన్సులిన్ని క్రమబద్ధం చేసి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించి డయాబెటిస్ అదుపులో ఉంచుతుంది.
కొలెస్ట్రాల్ తగ్గించి గుండె జబ్బులు వంటివి రాకుండా చేస్తాయి. ముఖ్యంగా అధిక బరువును తగ్గించడానికి దోహదపడతాయి. దీంట్లో రెండు యాలకులు కూడా వేసుకోవాలి. వాటిని వలిచి వేసుకోవాలి. యాలకులు శరీర ఉష్ణోగ్రత పెంచి జీవక్రియ రేటును బాగా పెంచుతాయి. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి రక్తప్రసరణ బాగా జరగడంలో సహాయపడుతుంది. నిద్రలేమి సమస్య తగ్గుతుంది. తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్క వేయాలి. పొడిలా కాకుండా ముక్క మాత్రమే వేయాలి. ఆహారం జీర్ణం చేయడంలో, కొవ్వు కణాలను కరిగించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
దాల్చిన చెక్క మెటబాలిజం రేటు పెంచుతుంది. దీంతో ఒంట్లో పెరిగిన కొవ్వు కరిగి అధికబరువు సమస్య తగ్గుతుంది. దీంట్లోనే జీలకర్ర కూడా వేసుకోండి. శరీరంలో తొంభై శాతం మంది బరువు పెరగడానికి ప్రధాన కారణం తిన్న ఆహారం జీర్ణమవకపోవడం. జీలకర్ర లో ఉండే థీమోల్ కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. దీంతో పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది. వీటన్నింటిని పది నుండి పదిహేను నిమిషాలు మరిగించాలి. ఇవి బాగా మరిగి నీళ్ళు రంగుమారాక నీళ్ళు వడకట్టాలి.
తర్వాత వీటిని పారేయకుండా బిర్యానీ ఆకు, పెరుగు మిక్సీ చేసి ముఖానికి అప్లై చేయొచ్చు. ఓపెన్ పోర్స్ తగ్గడమే కాకుండా మొటిమలు మచ్చలు కూడా తగ్గుతాయి. బిర్యానీ ఆకులో చర్మాన్ని లైటెన్ చేసే లక్షణాలు అధికం. ప్రతిరోజూ ఈ డ్రింక్ మూడుసార్లు తీసుకోవాలి. ఉదయాన్నే ఒకసారి, మధ్యాహ్నం, సాయంత్రం కూడా తీసుకోవాలి. ఒకేసారి చేసుకోవచ్చు లేదా ఏపూటకాపూట తయారుచేసుకోవచ్చు. ఈ డ్రింక్ గోరువెచ్చగా తీసుకోవాలి. ఉదయాన్నే పరగడుపున , మధ్యాహ్న భోజనానికి అరగంట ముందు, రాత్రి భోజనం చేసిన గంట తర్వాత తీసుకోవాలి. ఇలా రోజుకు మూడుసార్లు నెలరోజుల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి