జుట్టు రాలడం సమస్య సర్వసాధారణం అయిపోయింది. దాన్ని తగ్గించుకునేందుకు రకరకాల ఆయిల్స్, క్రీమ్స్ ను ఉపయోగిస్తారు. పార్టీలో అనేక రకాల కెమికల్స్ ఉంటాయి కెమికల్స్ జుట్టు కుదుళ్ళకు పట్టించి జుట్టుకు తెల్లని జుట్టు రాలడానికి తోడ్పడతాయి. సాధారణంగా జుట్టు గడ్డం తగ్గించుకోవడానికి రకరకాల షాంపూలను కూడా ఉపయోగిస్తాం. షాంపూలో ఉండే కెమికల్స్ కూడా జుట్టు కుదుళ్లను బలహీనం చేస్తాయి. జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది.
జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు చివర్లు చిట్లడం వంటి సమస్యలు ఎక్కువగా బాధిస్తున్నాయి. నెలకు ఒకసారి ఇది ట్రై చేసినట్లయితే ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం బ్యూటీపార్లర్‌కు వెళ్లి చేయించుకోవాలంటే 5000 వరకు వసూలు చేస్తారు. కేవలం పది రూపాయల తో మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్యాక్ ట్రై చేయడం వల్ల హెయిర్ డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. జుట్టు కుదుళ్ల లో పేరుకుపోయిన కెమికల్స్ అన్నీ పోతాయి. దీని కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు చెంచాల ముల్తాని మట్టి వేసుకోవాలి.
దీనిలో ఒక చెంచా అలోవెరా జెల్ వేసుకోవాలి. అలోవెరా జెల్ పడదు అనుకున్నవారు కీరదోసకాయ జ్యూస్ వేసుకోవాలి. అరచెక్క నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకోవాలి. నిమ్మరసం పడనివారు ఆపిల్ సైడర్ వెనిగర్ వేసుకోవాలి. తర్వాత తలకు అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా రోజ్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ ప్యాక్ అప్లై చేసుకోవడానికి ముందు తల స్నానం చేసి జుట్టు బాగా ఆరనివ్వాలి. తర్వాత ఈ ప్యాక్ అప్లై చేసుకునే ముందు నీళ్ళతో ఒకసారి జుట్టును తడిపి ప్యాక్ ను జుట్టు కుదుళ్ళకు బాగా అప్లై చేసుకోవాలి.
అప్లై చేసిన తర్వాత చేతివేళ్లతో 15 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. షాంపు చేయాల్సిన అవసరం లేదు. ఇలా నెలకు ఒకసారి చేయడం వల్ల జుట్టు కుదుళ్ళకు పట్టిన కెమికల్స్ అన్నీ పోతాయి. జుట్టు రాలడం, చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్స్, జుట్టు చివర్లు చిట్లడం వంటి సమస్యలు తగ్గుతాయి. జుట్టు చాలా మృదువుగా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఈసారి ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని ట్రై చేసి జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలను తగ్గించుకోండి. ఈ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది.