కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అనేది పెద్దల నుండి మనం వింటున్న మాట. ఈ కంద గడ్డ వండటానికి చాలా మంది ఇష్టం చూపించరు కారణం దీన్ని తరగాలంటే ఓపిక కావాలి, ముఖ్యంగా ఎలా తరాగలి అనేది తెలియక చాలా మంది దీని జిగురు వల్ల పుట్టే దురదకు బలైపోతుంటారు. అయితే కందగడ్డలో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకుంటే మనం కందగడ్డను ఎందుకు తినాలి అనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది.
జీర్ణక్రియకు దోహదపడుతుంది
జిమికాండ్ అనే పోషకం కందగడ్డలో ఉంటుంది ఇది శరీరం వేడి చేయడం వల్ల ఎదురయ్యే సమస్యల్లో ఒకటైన రక్తస్రావం ను తగ్గిస్తుంది. ఈ వేడి ప్రభావం కారణంగా, ఇది పిత్తాన్ని పెంచేటప్పుడు శ్లేష్మం మరియు గాలిని తగ్గించి తద్వారా జీర్ణక్రియకు సహాయపడుతుంది. కందగడ్డను తీసుకోవడం వల్ల తేలికగా అనిపిస్తుంది. అలాజీ జీర్ణక్రియను మెరిగుపరుస్తుంది.
చర్మానికి మంచిది
కందగడ్డలో ‘ఐసోఫ్లేవోన్స్’ ఉంటుంది, ఇది చర్మానికి మంచి రంగును ఇవ్వడంలో సహాయపడుతుంది. చర్మం కళ కోల్పోవడం, వాడిపోవడం, పొడిబారడం వంటి అనేక రకాల చర్మ సమస్యలతో ఇది పోరాడగలదు. దీన్ని దీర్ఘ కాలికంగా ఉపయోగించడం వల్ల చర్మాన్ని మృదువుగా మరియు కాంతివంతంగా చేయడానికి సహాయపడుతుంది.
బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది
ఇది మంచి గట్ బాక్టీరియాతో నిండి ఉంటుంది మరియు జీర్ణక్రియ ప్రక్రియను సమర్థవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. అందువల్ల, ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు ప్రకోప ప్రేగు సిండ్రోమ్ కారణంగా ఎదురయ్యే అధిక బరువు సమస్యలను సులువుగా తగ్గిస్తుంది.
వ్యాధుల నుండి రక్షిస్తుంది
విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైటోన్యూట్రియెంట్స్ ఇప్పటికే ఉన్న అనేక ఆరోగ్య సమస్యలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఉబకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్ మరియు క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తులు వారి వ్యాధుల నుండి నయం కావడానికి కందగడ్డను ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
హార్మోన్లను పెంచుతుంది
ఎదిగే వయసులో ఉన్న ఆడపిల్లలు మరియు మగపిల్లల హార్మోన్లను బ్యాలెన్స్ చేయడంలో కందగడ్డ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. తద్వారా వయసుకు తగ్గ ఎత్తు, బరువు ను చేకూరుస్తుంది.
చివరగా…..
పైన చెప్పుకున్నట్టు కందగడ్డ ద్వారా ఇన్ని ప్రయోజనాలు చేకూరుతున్నపుడు కాస్త ఓపికగా ఎలా సులువుగా వండుకోవచ్చో తెలుసుకుని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అందమైన ఆరోగ్యం మీ సొంతమవుతుంది.
కడుపు దిగువ భాగాల కేన్సర్ ని తగ్గిస్తుంది