చిన్న చిన్న పనులకే అలసి పోవడం, బలహీనంగా అనిపిస్తూ ఉండడం ఇవన్నీ అనారోగ్యాలు కావు. కానీ పెద్ద పెద్ద సమస్యలకు ముందస్తు సూచనలుగా భావించవచ్చు. వెంటనే జాగ్రత్తపడాలి. మన జీవనశైలి మార్పులమూలంగా మనం తినే ఆహారంలో మార్పులు వస్తున్నాయి. ఈకాలంలో స్నాక్స్ అనగానే పిజ్జాలు, బర్గర్లు అంటున్నారు. ఈ చిన్న చిన్న మార్పులే జీవితంలో పెద్ద మార్పులకు కారణమవుతాయి. ఈ సూచనల ద్వారా పెద్ద అనారోగ్యాలను గుర్తించవచ్చు. ఈ చిట్కావలన నీరసం, అలసట తగ్గి బలహీనతలను తగ్గిస్తుంది.
బక్కగా బలహీనంగా ఉన్న శరీరాన్ని పుష్టిగా మారుస్తుంది. మీ శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది. అరవై ఏళ్ళ వయసులో ఉన్నవారిని సైతం ఆరోగ్యం గా యాక్టివ్గా ఉండేలా చేస్తుంది. ఈ రెమిడీ కోసం మనకు కావలసింది రెండే రెండు పదార్థాలు. అవి వేయించిన శనగలు వాటినే ఉప్పు శనగలు అంటారు. ఈ శనగలలో కాల్షియం, ప్రొటీన్ విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఇవికేవలం శరీరానికి బలాన్ని ఇవ్వడమే కాకుండా నరాలను కూడా ఆరోగ్యం గా మారుస్తాయి. ముఖ్యంగా మన శరీరానికి తగినంత పౌష్టికాహారం కూడా అందిస్తాయి.
దీంతో న శరీరం చిన్న చిన్న అనారోగ్యాలను తట్టుకుంటుంది. కాబట్టి వేయించిన శనగలు ఒక గిన్నెతో తీసుకోండి. ఈ శనగలు సూపర్ మార్కెట్లో కానీ, కిరాణా షాపుల్లో కానీ అందుబాటులో ఉంటాయి. ఇంకో పదార్థం బెల్లం. ఇది మన శరీరంలో రక్తహీనత తగ్గించి, ఎముకలను బలంగా చేస్తుంది. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బెల్లం ముక్క తీసుకుని పొడిలా చేసుకోవాలి. వీలైతే తాటిబెల్లం, పాతబెల్లం బ్రౌన్ కలర్లో ఉండే బెల్లం ఉంటుంది. రోజూ చిన్న బెల్లం ముక్క దానితోపాటు రెండు గుప్పిళ్ళ శనగలు తీసుకోవాలి. కలిపి లేదా విడివిడిగా తినచ్చు.
మరొక ముఖ్యమైన పదార్థం పాలు.ఒక గ్లాసు పాలు తీసుకుని గోరువెచ్చగా ఉండాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో శనగలు, బెల్లం తినేయ్యాలి. అరగంటసేపటి తర్వాత గోరువెచ్చని పాలు తాగాలి. ఇలా పదిహేను రోజులపాటు రోజూ తింటే బలహీనత, అలసట తగ్గిస్తుంది. శరీరంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోగనిరోధక శక్తి అవసరం. శనగలు, బెల్లాన్ని కలిపి తినడంవలన కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీంట్లో ఉండే కాల్షియం వలన దంతాలు బలంగా తయారవడంతోపాటు దంతసంబంధ సమస్యలు తగ్గుతాయి. ఎముకలను బలంగా చేస్తుంది. కీళ్ళనొప్పులు, వాపులు తగ్గుతాయి. బలంగా ఆరోగ్యం గా మీ పనులు మీరు చేసుకుంటారు.
శనగలు తీసుకోవడం శరీరానికి కావలసిన ప్రొటీన్ అందుతుంది. శనగలలో ఉండే విటమిన్ బి6 మెదడు ఆరోగ్యాన్ని, పనీతీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. బెల్లం కూడా తీసుకోవడంవలన బి6పుష్కలంగా లభిస్తుంది. మానసిక స్థితిని నియంత్రించే సెరటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గుతుంది. శక్తి లేనట్టు, బలం లేనట్టు ఉన్నప్పుడు ఈ బెల్లం శనగలు తింటే ఇవి మీకు బాగా పనిచేస్తాయి. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. రక్తహీనత సమస్య ను తగ్గిస్తుంది.
ప్రొటీన్ ఐరన్ రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. హర్మోనల్ ఇన్బాలన్స్ తగ్గించడంలో దోహదపడుతుంది. నెలసరి సరిగ్గా వచ్చేలా చేస్తుంది. రాత్రి పూట శనగలు,బెల్లం తిని గ్లాసు పాలు తాగితే శ్వాస కోశ సమస్యలు తగ్గుతాయి. వీర్యదోషం నియంత్రిస్తుంది. లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. చూసారా నీరసాన్ని తగ్గించడంతోపాటు బలాన్ని పెంచడంలో అద్బుతంగా పనిచేసే ఈ పదార్థాలు ఖరీదైనవి కూడా కాదు. క్రమం తప్పకుండా పాటించి ఆరోగ్యంగా జీవించండి.
మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి
Very valuable important helpful information.