energy booster drink homemade

పాలలో 1 స్పూన్ ఇది కలిపి తాగితే 10 గుర్రాలతో సమానమైన శక్తి వస్తుంది, 80లో 20లా బలంగా పుష్టిగా ఉంటారు

ఆక్రోట్ చూడడానికి ముడతలు పడినట్టు ఉండి మెదడును పోలి ఉండే ఈ డ్రై ప్రూట్స్ ఆరోగ్య రక్షణలో అగ్రగామి అని తెలుసా. పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచి మెదడు పనితీరును మెరుగుపరిచే న్యూట్రీషన్లు కలిగిన ఆహారం. Adhd, మానసిక సమస్యలు ఉన్న పిల్లల్లో సహజంగా మానసిక సమస్యలు తగ్గించే మంచి అల్పాహారంగా చెప్పొచ్చు. శ్రద్ధ, ఏకాగ్రత లేక చదువుపై దృష్టి నిలపలేకపోతున్న పిల్లలకు ఆక్రోట్స్ ఒమెగా 3 సమృద్ధిగా అందించి మంచి ఫలితాలు చూపిస్తాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండీ.

ఆక్రోట్స్ క్రమం తప్పకుండా తినడం వలన శరీరంలో వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం అయి వయసులో అసలు కంటే చిన్నగా కనిపిస్తారు. డిప్రెషన్ లక్షణాలను కూడా నివారిస్తుంది. గర్భవతుల్లో పిండం ఎదుగుదల మరియు మెదడు ఎదుగుదలకు దోహదపడుతుంది. ఆక్రోట్స్ లో న్యూట్రీషన్ రిచ్ ఎసెన్సియల్ మినరల్స్ అధికంగా ఉంటాయి. ఈ డ్రైప్రూట్స్లో ప్రొటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, మేంగనీస్ మరియు పొటాషియం అధికంగా లభిస్తాయి. శరీరంలో ఉండే ఈ లోపాలను ఆక్రోట్స్ తీసుకోవడం ద్వారా అధిగమించవచ్చు. 

నిస్సత్తువ, చిన్న పనులకే శక్తి లేకపోవడం లాంటి సమస్యలకు ఆక్రోట్స్ ఆహారంలో భాగం చేసుకోవడం వలన తగ్గించుకోవచ్చు. గుండె ఆరోగ్యానికి కూడా ఆక్రోట్స్ మంచివే. ఇందులో ఉండే ఒమెగా 3 గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. కార్డియోవాస్క్యులర్ జబ్బులను అదుపులో పెట్టడానికి, రక్త ప్రసరణ మెరుగుపరచడానికి, బరువును బ్యాలన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్, డిమెన్షియా లక్షణాలను తగ్గిస్తుంది.

రోజూ మరిగే పాలల్లో నాలుగయిదు ఆక్రోట్స్, రెండు చెంచాల కిస్మిస్ లను వేసీ పటికబెల్లంతో తీసుకోవడం వలన తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా మంచి బలంగా, మరియు శరీర పుష్టిని పొందుతారు. శృంగార సంబంధ సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇందులో ఉండే కిస్మిస్ కూడా ఆరోగ్యానికి కావలసిన పోషకాలను కలిగి ఉంటాయి. ఇందులో ఉండే ఖనిజ లవణాలు, విటమిన్లు, ఎంజైములు అధికం. జీర్ణశక్తిని ఎక్కువ చేసి , రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఆహారం ద్వారా సంభవించే అనారోగ్యాలను తగ్గించి త్వరితగతిన వృద్ధాప్యం రాకుండా చేస్తుంది.

1 thought on “పాలలో 1 స్పూన్ ఇది కలిపి తాగితే 10 గుర్రాలతో సమానమైన శక్తి వస్తుంది, 80లో 20లా బలంగా పుష్టిగా ఉంటారు”

Leave a Comment

error: Content is protected !!