energy boosting laddu

రోజుకి 1 లడ్డు…నరాల బలహీనత,పాదాల నొప్పి,మైకం,ఎముకల బలహీనత,డయబెటిస్,రక్తహీనత జీవితంలో ఉండవు

ఈరోజుల్లో ప్రతిఒక్కరు వయసుతో సంబంధంలేకుండా ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఏదైనా నీరసం రాగానే కంగారు పడి డాక్టర్ దగ్గరకు వెళ్తూ ఉంటాం. అలా కంగారు పడకుండా సమస్య ప్రారంభంలో ఉన్నప్పుడు ఇంటిచిట్కాలతో సమస్య ను అధిగమించవచ్చు. మోకాళ్ళనొప్పులు, కీళ్ళనొప్పులు, నడుస్తున్నప్పుడు పాదాలు తేలిపోతున్నట్టు అనిపించడం అలాగే రాత్రి పడుకున్నప్పుడు కండరాలు పట్టేయడం, శారీరక బలహీనత, శరీరంలో బలం లేనట్లు ఉండడం అలసట, నిస్సత్తువ, ఏపనీ చెయ్యాలనిపించకపోవడం అధికరక్తపోటుకు ముఖం పీక్కుపోయినట్టు ఉండడం, కంటిచూపు మందగించడం లాంటి అన్ని సమస్యలకు ఈ లడ్డు పరిష్కారం చూపించబోతుంది. ఈ లడ్డు ఎలా తయారు చేయాలి. ఎప్పుడెప్పుడు తినాలి లాంటి విషయాలు ఇప్పుడు చూద్దాం. 

మంటపై పాన్ పెట్టి ఒక కప్పు అవిశెగింజలు వేసుకోవాలి. ఇక ఇందులో ఒక కప్పు నువ్వులు వేసుకోవాలి. నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు ఏవైనా పరవాలేదు. ఇవి బాగా వేగిన తర్వాత పొడిచేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్లో నెయ్యి వేయాలి. నెయ్యి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అలసట తగ్గించి శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇందులో పది దాకా బాదంపప్పులు వేసి వేయించాలి. బాదంలో అనేక పోషకాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, నీటిలో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. శరీరంలో మంచి బాక్టీరియా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. కండరాలు నొప్పులను, అలసట నిస్సత్తువ తగ్గిస్తుంది. తర్వాత కిస్మిస్ వేసుకోవాలి. తర్వాత ఒక పాన్లో కొంచెం నెయ్యి వేసి కప్పు గోధుమ పిండి వేసి మంచి వాసన వచ్చేంతవరకూ వేయించాలి. 

ఇందులో శరీరానికి బలాన్ని చేకూరుస్తాయి. కిస్మిస్ అనేక పోషకాలను కలిగిఉంటాయి. ఇవన్ని పక్కకి పెట్టుకుని అవిశెగింజలు ఒకప్పుడు పెద్దగా ఎవరికీ తెలియదు. మంచి వాసన వచ్చేవరకూ వేయించాలి. ఒకప్పుడు అవిశెగింజలు ఆరోగ్య ప్రయోజనాలు తెలియకపోవడం, అరుదుగా దొరకడంతో వినియోగంలో ఉండేవి కాదు. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో సహాయపడతాయి. చర్మసమస్యలు తొలగిస్తాయి. నువ్వులు కీళ్ళనొప్పులు, మోకాళ్ళనొప్పులు తగ్గించడంలో సహాయపడతాయి.మన శరీరానికి మేలుచేసే ఎన్నో పోషకాలు నువ్వులలో పుష్కలంగా ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. నువ్వులలో సిలీనియం, కాపర్, జింక్ అధికంగా ఉంటాయి.

 తర్వాత వీటన్నింటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి.మొదట గోధుమ పిండి, తర్వాత అవిశెగింజలు, నువ్వులు పొడి, తర్వాత వేయించిన బాదం, కిస్మిస్ పొడిచేసి వేసుకోవాలి. దీంట్లో ఆర్గానిక్ బెల్లం పాకం కూడా వేయాలి. బెల్లంలో ఐరన్, పొటాషియం అధికంగా ఉంటాయి. బెల్లంలో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. పాకం వచ్చిందని తెలియడానికి నీటిలో వేస్తే కరగకుండా ఉంటే పాకం వచ్చినట్లు. ఈ పాకాన్ని ఈ పొడి మిశ్రమంలో వేసి ఉండలు చుట్టాలి. రోజుకు ఒక లడ్డు తింటే సరిపోతుంది. దీనివలన శరీరంలో అనేక అనారోగ్యాలు తగ్గి ఆరోగ్యం గా ఉంటారు. ఇంట్లోనే ఉండే ఈ పదార్థాలతో ఆరోగ్యాన్ని సొంతం చేసుకోడం ఇంత సులువయితే ఎవరు కాదంటారు చెప్పండీ.

మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

Leave a Comment

error: Content is protected !!