estrogen benefits for males

పది లాభాలు కలిగిన విషయాలు దీనిలో ఉన్నాయి….. అబ్బో స్త్రీలు అసలు వదలకండి…….

స్త్రీల హార్మోన్ ఈస్ట్రోజన్ తగు మోతాదులో విడుదల కావడం వలన స్త్రీలకు కలిగే 10 లాభాలు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా కాల్షియం ఎముకలలోకి బాగా వెళ్లేటట్లు చేసి ఎముకలు పుష్టిగా, దృఢంగా ఉండడానికి ఈస్ట్రోజన్ సహాయపడుతుంది. రెండవ లాభం గర్భసయ గోడలు ఎండోమెట్రీయం పొరలను ఆరోగ్యకరంగా తయారుచేసి సరైన మందంలో ఉంచి ఎగ్ రిలీజ్ అయినప్పుడు న్యూట్రస్ లోకి వచ్చినప్పుడు ఆ బేస్ ని సిద్ధం చేస్తుంది. అందువలన గర్భసయ గోడకి ఈస్ట్రోజన్ హార్మోన్స్ చాలా ముఖ్యం.

మూడోదిగా స్త్రీల బ్రెయిన్ కు ఈస్ట్రోజన్ హార్మోన్ బాగా ఉపయోగపడి మూడ్ స్వింగ్స్, డిప్రెషన్స్ వంటివి రాకుండా బ్యాలెన్స్ అండ్ రిలాక్స్డ్ గా ఉంచడానికి ఈస్ట్రోజన్ హార్మోన్ ఉపయోగపడుతుంది. నాల్గవదిగా స్త్రీలలో పీరియడ్స్ సైకిల్ కరెక్ట్ గా రావడానికి ఈస్ట్రోజన్ హార్మోన్ ఉపయోగపడుతుంది. ఐదోవదిగా స్త్రీలలో బ్రెస్ట్ టిష్యూ పెంచడానికి ఈస్ట్రోజన్ హార్మోన్ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పిల్లలకు పాలు ఇవ్వడానికి స్త్రీలకు బ్రెస్ట్ కరెక్ట్ సైజులో ఉండడం చాలా అవసరం.

ఆరవధిగా అండాశయంలో ఎగ్స్ తయారవడానికి ఈస్ట్రోజన్ హార్మోన్  చాలా అవసరం. ఈ హార్మోన్ సరిగ్గా విడుదల కాకపోతే ఎగ్స్ మెచ్యూర్ కావు. గర్భం వచ్చే అవకాశం తగ్గిపోతుంది. ఏడవదిగా చర్మం నిగారింపుకు ఈ హార్మోన్ చాలా అవసరం. ఒకవేళ ఈస్ట్రోజన్ తగ్గితే చర్మంలో మార్పులు వచ్చి చర్మం డ్రై గా అయిపోతుంది. ఎనిమిదవదిగా రక్తనాళాల్లో ఇన్ఫ్లమెషన్ తగ్గించి రక్త ప్రసరణ హెల్తీగా జరగడానికి ఉపయోగపడుతుంది. అందువలన స్త్రీలలో హార్ట్ ఎటాక్ తక్కువగా వస్తాయి. తొమ్మిదవదిగా ఫ్యాట్ డిపాజిట్ తగ్గించడానికి ఈ హార్మోన్ సహాయపడుతుంది.

అందువలన ఈ హార్మోన్ సరిగ్గా విడుదల కాకపోతే స్త్రీలు బరువు పెరిగే అవకాశం ఉంటుంది. పదవదిగా ఈస్ట్రోజన్ హార్మోన్ కరెక్ట్ గా ఉంటే మెనోపాజ్ దశ సరళంగా జరిగిపోతుంది. హాయిగా పీరియడ్స్ పోతాయి. కాబట్టి అన్ని రకాల లాభాలు ఈస్ట్రోజన్ హార్మోన్ సక్రమంగా రిలీజ్ అవ్వడం వల్ల కలుగుతాయి. ఇది మంచిగా ఉత్పత్తి కావాలి అంటే నేచురల్ గా లభించే మొలకలు, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, ఫ్రూట్స్, హై ప్రోటీన్ ఫుడ్ ఇటువంటివి బాగా తినాలి. డైరెక్ట్ గా ఈ హార్మోన్ లభించేది అనాసపువ్వు, సోయాబీన్స్, సోయాబీన్ కార్డ్ లేదా తోఫు ఇటువంటివన్నీ బాగా ఉపయోగించవచ్చు. ఇవన్నీ ఈస్ట్రోజన్ ను బాగా పెంచుతాయి…..

Leave a Comment

error: Content is protected !!