every couple must know these facts

ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోండి

అంగస్తంభన సరిగా జరగట్లేదు లేదా తొందరగా అయిపోవడం వల్ల ఎక్కువ సేపు ఉండకపోవడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది బయట అమ్మాయి దగ్గర కలిసినప్పుడు అంగస్తంభన బాగానే జరుగుతుంది. నా భార్య దగ్గర అంగస్తంభన జరగడం లేదు వంటి సమస్యలు చెప్తారు. బయట మీ దగ్గర అంగస్తంభన బాగానే జరుగి భార్య  దగ్గర జరగట్లేదు అంటే ఏదైనా సమస్య ఉందా పరిష్కారం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

రోజు ఇంటి భోజనం తినే వ్యక్తి బయట హోటల్ ఫుడ్డు తినే సరికి చాలా బాగుంది అనిపిస్తుంది.  రోజు హాస్టల్లో లేకపోతే బయట ఆహారం  తీసుకునే వారికి ఇంటి భోజనం అమృతంలా అనిపిస్తుంది. అలాగే రోజు భార్యతో కలిసి వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గిపోయి బయట స్త్రీతో కలవడం వలన కొత్తదనం అనిపించి  హార్మోన్స్ కావాల్సినన్ని విడుదలయ్యి, నరాలు ప్రేరేపించబడి సెక్స్ కోరికలు ఎక్కువ అవుతాయి. అంగస్తంభన సరిగా జరుగుతుంది. రోజు భార్య ఇంట్లో ఉండటం ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో సమస్యలు వంటి విషయాలు మాట్లాడడం వల్ల భార్య దగ్గర అంగస్తంభన జరగదు.

ఇంటి సమస్యలు, ఇంట్లో పరిస్థితులు మధ్య ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే అప్పుడు భార్య భర్తలకు  సెక్స్ కోరికలు వస్తాయి. ఆ సమయంలో ఇంటి విషయాలు, ఇంట్లో గొడవలు, ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడటం వలన భర్తకు భార్య మీద ఇంట్రెస్ట్  తగ్గిపోతుంది. భార్య భర్తకు నచ్చినట్టుగా అన్ని  విషయాల్లో తనను తాను మార్చుకుంటూ ఇష్టాలను కూడా మార్చుకొని ఉన్నా సరే భర్తకు పరాయి స్త్రీల మీద వ్యామోహం ఎక్కువగా ఉండటం వలన భార్య మీద ఇంట్రెస్ట్ చూపించరు.

కొంతమంది  రిలేషన్ పెట్టుకున్న స్త్రీలు ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేయడం వలన కండోమ్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకోకుండా కలవడం వల్ల అనేక ఆరోగ్య  సమస్యలువచ్చే అవకాశం ఉంటుంది. వివాహేతర సంబంధాలకు ముఖ్యకారణం భార్య భర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్ లేకపోవడం. దీని వల్ల  భార్య అయినా భర్త అయినా ఇతర స్త్రీలతో లేక ఇతర వ్యక్తులతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ కూర్చుని  సెక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వివాహేతర సంబంధాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

భార్య భర్తల మధ్య రిలేషన్ బాగుంటుంది.  వేశ్యలు లేదా పరాయి స్త్రీలు  ఆకర్షించిన మీ భర్త  అటు వెళ్ళ కుండా ఉండాలి  అని వాళ్ళని పెద్దమనుషులలో  పెడతాము లేక పంచాయతీ చేస్తాను వంటి  మాటలతో భయపెట్టకూడదు. అలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య రిలేషన్ దెబ్బతింటుంది. మీ భర్త  పరస్త్రీ వైపు వెళ్లకుండా మీరే జాగ్రత్తపడాలి. అలాగే భర్త కూడా భార్యకు సంతృప్తిని ఇవ్వలేక పోతే వాళ్లు  కూడా వివాహేతర సంబంధాలు  పెట్టుకుంటారు. స్త్రీ అయినా పురుషుడైన మానసికంగా, శారీరకంగా సుఖంగా ఉంటేనే వివాహేతర సంబంధాల జోలికి వెళ్లకుండా ఉంటారు.

Leave a Comment

error: Content is protected !!