Everything You Need To Know About Stretch Marks

స్ట్రెచ్ మార్క్స్ కేవలం ఒక్క సిట్టింగ్ లోనే తీసేస్తుంది……. ప్లాస్టిక్ సర్జరీ కూడా దీని ముందు బలాదూర్…….

బరువు పెరగడం అనేది సిటీలో 3 వంతులకు మందికి పైగా కనబడుతున్న సమస్య. దీనివల్ల ముఖ్యంగా స్త్రీల యొక్క తొడల భాగాలు, సీట్ భాగాలు బాగా పెరిగిపోతూ ఉంటాయి. మగవారికి పొట్ట, జెబ్బలు వంటివి బాగా పెరిగిపోతూ ఉంటాయి. ఏ భాగాల్లో కొవ్వు బాగా పెరిగిపోతూ ఇబ్బంది పెడుతూ ఉంటాయో ఆ భాగాల్లో స్కిన్ బాగా డామేజ్ అయిపోతుంది. అక్కడ కొత్తగా స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తూ ఉంటాయి. అందువలన వారి యొక్క చేతులు, తొడలు, జెబ్బలు, పొట్ట భాగాలలో ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి.

ఇలాంటి స్ట్రెచ్ మార్క్స్ లైఫ్ లో రాకుండా ఉండాలి అన్నా, వచ్చినవి తగ్గాలి అన్న జామాకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. జామకాయలు అందరూ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. జామకాయలు అమ్మే చోట జామ ఆకులు కూడా ఉంటాయి. ఈ ఆకులు తెచ్చుకుని ఆ ఆకులను చక్కగా పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ ను ఏ భాగాలు అయితే స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయో, లేదా రాకూడదు అన్న భాగాల్లో కూడా రాసుకోండి. ఈ స్ట్రెచ్ మార్క్స్ కి ఇందులో ఉండే లైకోపీన్ అనే కాంపౌండ్ బాగా ఉపయోగపడుతుంది. 

వచ్చిన వారికి లోపల ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. రెండవ లాభం ఏమిటి అంటే ఇందులో ఉండే విటమిన్ సి విరిగిపోయిన కొలజన్ మేస్ రిపేర్ చేయడానికి సహాయపడుతుంది. దీనికోసం ఇందులో ఉండే విటమిన్ సి బాగా ఉపయోగపడుతుంది. చర్మం పొరల్లోకి జామాకు పేస్టు అప్లై చేయడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గించి స్ట్రెచ్ మార్క్స్ రాకుండా రక్షించడానికి, వచ్చినవారికి కొంతవరకు స్పీడ్గా నయం కావడానికి ఎక్కువ బెనిఫిట్ ఇస్తుంది. ఈ రెండు ప్రధానంగా లాభాలు కనిపిస్తున్నాయని సైంటిఫిక్ గా నిరూపించారు.

2021 సంవత్సరంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ రిసెర్చ్ కాటన్ టెక్నాలజీ ఇండియా వారు. మనవారే జామాకులపై రీసెర్చ్ చేశారు. కాబట్టి జామాకులు తెచ్చుకుని ఒంటికి పూస్తూ ఉంటే స్ట్రెచ్ మార్క్స్ వచ్చే ఏరియాలో పట్టించి అరగంట సేపు ఉంచాలి. ఎలా అంటే జామకుల పేస్ట్ ను రెండు స్పూన్లు తీసుకొని అందులో అలోవెరా జెల్ కలుపుకొని ఒకటి లేదా ఒకటిన్నర స్పూన్ తేనెను కలుపుకోవాలి. ఈ మూడిటి మిశ్రమాన్ని ఆ ప్రదేశంలో బాగా రుద్ది ఒక అరగంట సేపు అలా ఉంచి ఆ తర్వాత శుభ్రంగా స్నానం చేయాలి. లోపలికి మంచినీళ్లు ఎక్కువ తాగుతూ బయటకు జామాకుతో చేసిన పేస్ట్ ఇలా ఉపయోగించడం ద్వారా స్ట్రెచ్ మార్క్స్ నుంచి విడుదల పొందవచ్చు….

Leave a Comment

error: Content is protected !!