దూర ప్రయాణాలు మోటార్ సైకిల్ మీద నిత్యం చేసే వారికి వచ్చే మెడ నొప్పిని నడుం నొప్పిని తగ్గించుకోవడానికి లేని వారికి రాకుండా ఉండడానికి తప్పనిసరిగా కొన్ని వ్యాయామాలు అయితే చేయాలి. తిన్నగా నుంచున్న తర్వాత కుడి చేతిని తలనీ పట్టుకుని కుడి చేతి వేళ్లతో తలను కుడి వైపుకు ఆపుకోవాలి. ఎడమ చేతిని నడుం మీద పెట్టుకోవాలి. సైడ్ మజిల్స్ అన్ని బాగా స్ట్రీచ్ అవుతాయి. దానివల్ల నొప్పి బాగా తగ్గుతుంది. కదలకుండా బండి మీద అలా కూర్చునే సరికి స్టిఫ్ అయిన మజిల్స్ అన్ని రిలాక్స్ అవుతాయి. ఈసారి ఎడమ చేయిని తల మీద పెట్టుకుని ఎడమవైపు లాకుంటూ కుడి చేతిని నడుము మీద పెట్టుకోవాలి.
అలా పెట్టి ఒక పది పదిహేను సెకండ్లు అలాగే ఉంచితే మంచి ఫలితం ఉంటుంది. 30 సెకండ్స్ అయినా అలా ఉండొచ్చు.
ఇలా ఫైవ్ సిక్స్ టైమ్స్ ఆర్ సెవెన్ టైమ్స్ చేయాలి. ఇలా చేస్తే మెడ నొప్పి, నడుం నొప్పి కి చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే కాలు రెండు దూరంగా పెట్టి చేతులను వేలల్లో వేళ్ళు పెట్టి లాక్ చేసి పైకి పట్టుకోవాలి. తాడసంలో ఆ విధంగా పైకి పట్టుకుని సాగదీస్తాం. ఎవరో లాగినట్టుగా ఎడమవైపు బెండ్ అవ్వాలి. మళ్లీ కుడివైపు బెండ్ అవ్వాలి. ఇలా రెండు వైపులా బెండ్ అవడం వల్ల నడుం భాగంలో స్టిఫ్ అయిన కండరాలన్నీ ఆ భాగంలో ఒత్తిడి గురైనవన్నీ బాగా ఫ్రీ అవుతాయి.
ఈ తడాసనంలో మూమెంట్ ని సైడ్ టు సైడ్ ఇస్తాం. మూడవది తిర్యక్ తడాసనం దీనిలో సైడ్ కి ట్విస్ట్ అవుతాం. అలా చేతులు పెట్టేసి ట్విస్ట్ అవుతాం దీనివల్ల నడుము ఫ్రీ చేయడానికి దగ్గర నుండి నడుము దాకా బాగా ఫ్రీ చేయడానికి ఇది బాగా పనిచేస్తుంది.
తర్వాత స్ట్రైట్ గా నుంచుని ఏ భుజం అయితే డ్రైవింగ్ వల్ల నొప్పి వస్తుందో ఆ భుజాన్ని వెనక్కి నెట్టాలి. కుడి భుజం నొప్పి వస్తే దానిని వెనక్కి నెట్టి, మెడని పైకి లేపి కొద్దిగా ఎడమవైపుకి బెండ్ చేయాలి. ఇది మజిల్ రిలాక్స్ ఏషియన్ కి బాగా ఉపయోగపడుతుంది. ఇలా చేయడం ద్వారా షోల్డర్ భాగంలో వచ్చే నొప్పి చాలా వరకు తగ్గుతుంది. ఈ వ్యాయామాలను ఉదయం గాని సాయంత్రం గాని చేసుకోవచ్చు.