eye protection glass for mobile and computer

ఈ గింజలను తింటే ఇక కళ్ళజోడు అవసరమే ఉండదు…

ఎక్కువసేపు స్క్రీన్స్ చూడడం వల్ల ఆ లైట్ ఎఫెక్ట్ కంటి మీద పడుతూ ఉంటుంది. అలాగే లైట్లు కూడా కంటిమీద ఎక్కువ పడేకొద్దీ ఫోటో టాక్సెస్సిసి బాగా పెరిగిపోయి కంటి రెటీనా లోపల ఉండే మ్యాచులా డి జనరేట్ అవ్వడం, చూపు బ్లర్ గా రావడం, మధ్యలో స్పార్క్ కనపడడం లాంటి మార్పులు రావడం చాలా మందికి జరుగుతూ ఉంటుంది. మీ  కంటి రెటీనాలో మధ్యలో ఉండే మాక్యుల అనే భాగం డ్యామేజ్ అవ్వకుండా, డి జెనరేట్ కాకుండా రక్షించడానికి  అన్నటో సీడ్స్ బాగా ఉపయోగపడుతున్నాయని సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది. యూనివర్సిటీ ఆఫ్ అటానమ మెట్రోపాలిటీ  మెక్సికో దేశం వారు పరిశోధన చేసి నిరూపించడం జరిగింది.

            ఈ  అన్నాటో సీడ్స్ అరకిలో తీసుకుంటే 400 వరకు ఖర్చు ఉంటుంది. అన్నాటో సీడ్స్ వీటిలో ఉండే మెయిన్ కెమికల్ కాంపౌండ్స్ ఏమిటి అంటే బిగ్సిన్ మరియు నార్బిక్సిన్ ఈ రెండు కెమికల్ కాంపౌండ్స్ కంటిలో రిలీజ్ అయ్యే AZE ని న్యూట్రలైజ్ చేసి దాని యొక్క ప్రభావాన్ని తగ్గించి రెటీనా లోపల ఉండే మాక్యుల డి జనరేషన్ జరగకుండా కంటి లోపల మాక్యుల బ్లడ్ సప్లై బాగా జరిగేటట్టు చేయడానికి ఈ రెండు కెమికల్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. AZE అనేది హై బ్లడ్ ప్రెజర్ లో ఎక్కువ ఫామ్ అవుతుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి, హైపర్ టెన్షన్ ఉన్నవారికి చూపు ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం అనేది సర్వసాధారణంగా కనిపిస్తుంది.

          చాలా మందికి వయసు పెరిగే కొద్దీ AZE కూడా ఎక్కువ రిలీజ్ అవుతుంది. దీనివల్ల కంటికి వెళ్లే రక్త సరఫరా తగ్గిపోయి కంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి కంటి సమస్యల నుంచి రక్షించడానికి ఈ అన్నాటో సీడ్స్ అనేవి బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ అన్నాటో సీడ్స్ ని పౌడర్ చేసి సలాడ్స్ లో చల్లుకోవచ్చు, స్ప్రౌట్స్ లో చల్లుకోవచ్చు, అలాగే దీనిని వంటల్లో కూడా వేసుకోవచ్చు. ఇది నేచురల్ కలర్ ని ఇస్తుంది. మరి ఈ రోజుల్లో కంప్యూటర్, టాబ్, సెల్ ఫోన్ వీటితోనే ప్రపంచమంతా అన్నీ జరిగిపోతున్నాయి. కాబట్టి వీటి వాడకం ఎక్కువయ్యేసరికి చూపు మందగించే అవకాశం ఎక్కువగా ఉంది.

           ఈ చూపుని డ్యామేజ్ అవకుండా రక్షించుకోవడానికి ఇలాంటి అన్నాటో సీడ్స్ ని మనం ఉపయోగించుకోగలిగితే కంటికి ఎంతో మేలు చేసినట్టు జరుగుతుంది.

Leave a Comment

error: Content is protected !!