eye sight improve homeremedies

కళ్ళు స్పష్టంగా మరియు ప్రకాశవంతంగా ఎలా మార్చుకోవాలో – కళ్ళను తెల్లగా మార్చే చిట్కాలు ఇలా చేసుకోండి

మన చుట్టూ ఉన్న రంగుల ప్రపంచాన్ని చూడాలంటే మనకి కళ్ళు చాలా అవసరం. కళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మనం ప్రకృతి అందాలను చూడగలిగేది. ఇప్పటి పరిస్థితుల్లో కాలుష్యం, దుమ్ము కళ్ళలో పడి కళ్ళను ఎర్రగా అయ్యేలా చేస్తున్నాయి. ఎర్రబడిన కళ్ళను నిర్లక్ష్యం చేస్తే కంటిచూపు తగ్గడానికి కారణమవుతాయి. మరి ఆ కళ్ళ ఆరోగ్యం కోసం ఏం చెయ్యగలమో చూద్దాం రండి.

ఆయుర్వేదంలో ఉండే ఈ చిట్కాల ద్వారా కళ్ళను సహజంగా శుభ్రపరుచుకోవచ్చు. అందులో మొదటిది. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి. 

రోజ్ వాటర్ :-ఇందులో ప్రకృతి సహజంగా ఉండే పోషకాలు కంటి ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. అందుకే పడుకునేముందు రెండు చుక్కలు కంట్లో వేసుకుంటుంటే కళ్ళు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కాటన్ పాడ్పై రోజ్ వాటర్ వేసి కళ్ళపై పెట్టుకుంటే చల్లదనాన్నివ్వడంతో పాటు కళ్ళచుట్టూ వచ్చే నల్లదనం కూడా తగ్గుతుంది. 

కీరాదోసకోయ:- కీరాను చక్రాల్లా తరిగి కళ్ళపై పదినుండి పదిహేను నిమిషాలు పెట్టుకుంటే కళ్ళను చల్లబరిచి కళ్ళలో ఏర్పడే ఎర్రదనాన్ని తగ్గిస్తుంది. కళ్ళు ఆరోగ్యంగా మారడంతో పాటు కళ్ళను శుభ్రపరుస్తాయి. కీరారసాన్ని కళ్ళకు రాయడంవలన కళ్ళలో పేరుకున్న దుమ్ము, ధూళి శుభ్రంచేస్తుంది.

పాలు :-  పాలలో కళ్ళలోని టిష్యూలను రిపేర్ చేసే కారకాలు ఉంటాయి. ఫ్రిజ్లో పాలను పెట్టి అవి చల్లబడిన తర్వాత కాటన్పాడ్పై వేసి కళ్ళపై పెట్టుకొని ఐదునిమిషాలు తర్వాత చల్లనీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన కళ్ళను శుభ్రపరుస్తుంది. కళ్ళ ఉబ్బును తగ్గించి ఆరోగ్యం గా కళ్ళను తెల్లగా చేస్తాయి.

తేనె :- తేనే మీ కళ్ళలోని ఇన్ఫెక్షన్ తగ్గించి కళ్ళలోని ఎర్రదనాన్ని తగ్గిస్తుంది. స్వచ్ఛమైన తేనెను రోజూ రెండు చుక్కలు కంట్లో వేస్తుంటే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.

కీరా ఐస్క్యూబ్ :- కీరా రసాన్ని ఐసుగడ్డల్లా చేసుకుని కళ్ళపై మసాజ్ చేయడం వలన కళ్ళలో వేడి తగ్గి కళ్ళలో ఎర్రదనం తగ్గుతుంది. కళ్ళకు మసాజ్ చేయడంవలన నిద్రకూడా బాగా పడుతుంది. 

ప్రతిరోజూ ఆరు నుండి ఎనిమిది గంటల నిద్ర, ఫోన్, లాప్టాప్ల వాడకం తగ్గించడం, ఎక్కువగా వాడాల్సి వస్తే ఇరవై నిమిషాలకోసారి విరామం కూడా  ఇస్తూ ఉండాలి. ఈ చిన్న చిట్కాలతో మన కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

Leave a Comment

error: Content is protected !!