కొందరికి కనుబొమ్మలు, కనురెప్పలు చాలా పలుచగా ఉంటాయి. అక్కడ కూడా హెయిర్ ఫాల్ జరిగి మధ్య మధ్యలో ఖాళీలు వచ్చేస్తాయి. మగవారిలో గడ్డం త్వరగా పెరగాలన్న, హెయిర్ పాల్ జరిగి మధ్యలో వచ్చిన ఖాళీలు పోవాలన్నా, తెల్ల జుట్టు రాకుండా ఉండాలన్నా ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా ఒక గాజు సీసా తీసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి.
ఒక స్పూన్ కలోంజి విత్తనాలు కూడా వేసుకోవాలి తెల్ల జుట్టు పోయి నల్ల జుట్టు వచ్చేలా చేస్తాయి. ఒక స్పూన్ అవిస గింజలు వేసుకోవాలి. దీనిలో మూడు స్పూన్లు కొబ్బరినూనె. ఇంట్లో వాడుకునే కొబ్బరి నూనె ఏదైనా ప్యూర్ అయితే గనుక వేసుకోవచ్చు. మూడు చెంచాల ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. రెండు విటమిన్E కాప్సిల్స్ వేసి బాగా కలుపుకోవాలి.సీసా మూత పెట్టుకుని ఆ నూనె ఎండ బాగా తగిలేలా 4 రోజులు పాటు పెట్టుకోవాలి.
ఎండలో పెట్టడం వలన ఆ గింజలలో మెడిసినల్ ప్రాపర్టీస్ నూనెలోకి వస్తాయి. మెంతులు హెయిర్ గ్రోత్ అయ్యేలా చేసి హెయిర్ ఫాల్ తగ్గిస్తాయి. కలోంజీ విత్తనాలు జుట్టు రాలడం తగ్గించి తెల్ల జుట్టు నల్లగా చేస్తాయి. అవిసె గింజలు కూడా జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. ఆలివ్ ఆయిల్ జుట్టు రాలడం తగ్గించి ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. విటమిన్E క్యాప్సిల్స్ కూడా జుట్టు ఒత్తుగా పెరగడంలో సహాయపడతాయి.ఈ ఆయిల్ రాత్రి పడుకునే ముందు కను బొమ్మలకు, కను రెప్పలకు, మగవారికి గెడ్డంలో జుట్టు రాలి ఖాళీ వచ్చిన చోట అప్లై చేసి ఉదయం లేచిన వెంటనే కడిగేయాలి.
పగలు కూడా అప్లై చేసుకోవచ్చు.అప్లై చేసి కొన్ని గంటల తర్వాత కడిగేయడం వలన డస్ట్ ఏమైనా ఉంటే క్లీన్ అయిపోతుంది.ఈ ఆయి ల్ కను బొమ్మలు, కను రెప్పలు, గెడ్డం పలుచగా ఉన్నవారు రోజు అప్లై చేస్తే ఫలితం కనిపిస్తుంది.ఈ ఆయిల్ని ఐ లాసెస్ అప్లై చేసుకునేవి విడిగా దొరుకుతాయి వాటితో అప్లై చేయాలి.ఈ ఆయిల్ హెయిర్ ఫాల్ ఉన్నవారు హెయిర్ కి కూడా అప్లై చేసుకోవచ్చు.ఈ ఆయిల్ ఎక్కువగా చేసుకున్నప్పుడు ఇంగ్రిడియంట్స్ క్వాంటిటీ కూడా పెంచుకోవాలి. ఈ చిట్కాతో హెయిర్ గ్రోత్ ఆయిల్ ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.