ఒక రెండు సంవత్సరాలుగా కరోనా వలన ప్రతి ఒక్కరూ ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ మీటింగ్లంటూ స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది. దీనివలన కంటి సమస్యలు పెరగడం, దృష్టి తగ్గిపోవడం అనేది ఈమధ్యకాలంలో ఎక్కువ అయినట్టు డాక్టర్లు చెబుతున్నారు. స్కూల్కి వెళ్లే పిల్లలు కూడా చిన్న వయసులోనే కళ్ల జోడు వచ్చేస్తుంది. ఇలాంటి సమస్యలను తగ్గించుకోవడానికి మనం ఇంట్లోనే చేసుకునే ఒక చిట్కా చెప్తాను. దీనిని ఉపయోగించడం వలన కంటి సమస్యలు తగ్గి, దృష్టి అనేది పెరుగుతుంది.
దీని కోసం మనం ఐదు లేదా ఆరు నల్లమిరియాలు తీసుకోవాలి. వీటిని పొడిగా చేసుకొని వీటిలో అర చెంచా లేదా ముప్పావు చెంచా పటిక బెల్లం పొడి వేసుకోవాలి. పటిక బెల్లం మిస్రీ అని కూడా పిలుస్తారు. దీనిలో ఒక స్పూన్ ఆవు నెయ్యి వేసుకోవాలి. ఆవు నెయ్యి అందుబాటులో లేనప్పుడు మాత్రమే గేదె నెయ్యి వాడవచ్చు. ఈ మూడింటిని బాగా కలిపి పరగడుపున తీసుకోవాలి. ఇది తిన్న గంటవరకు ఏమీ తినకూడదు, తాగకూడదు.
ఇలా కనీసం మూడు నెలలపాటు చేయడం వలన కళ్ళజోడు అవసరం లేకుండా కంటి సమస్యలు తగ్గిపోతాయి. కంటి దృష్టి మెరుగుపడుతుంది. నల్ల మిరియాలు మనందరికీ బాగా తెలిసిన సుగంధ ద్రవ్యాలు, దీని రుచి మరియు ఘాటైన వాసనకు మిరియాలు ప్రసిద్ధి.
మిరియాలు పొటాషియం యొక్క గొప్ప మూలం. మన శరీరంలో పొటాషియం స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు, అది మన కంటి చూపును కూడా ప్రభావితం చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, నల్ల మిరియాలు తీసుకుంటూ ఉండటం వలన కాలక్రమేణా మీ దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడవచ్చు.
పొటాషియం స్థాయిలను సమతుల్యం చేయడంతో పాటు, మనం తినే ఆహారం నుండి లభించే విలువైన పోషకాలను గ్రహించడంలో కూడా ఇది సహాయపడుతుంది. బీటా కెరోటిన్, సెలీనియం, కర్కుమిన్ మరియు బి-విటమిన్లు వంటి పోషకాలను పొందడం కంటి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
నల్ల మిరియాలలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం కళ్ళు మరియు శరీరంలోని ఇతర భాగాలలో వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది యాంటీ బాక్టీరియల్ మరియు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంది, ఇవి ఆరోగ్యకరమైన కళ్ళు మరియు బలమైన కంటి చూపును కలిగి ఉండడంలో సహాయపడతాయి.
పటిక బెల్లం చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది ఇది కంటి చూపును మెరుగు పరచడంలో కూడా సహాయపడుతుంది. నెయ్యి లో ఉన్న ఔషధ గుణాలు శరీరంలో అనారోగ్యాలను నయం చేయడంతోపాటు దృష్టిని మెరుగుపరుస్తాయి. ఈ చిట్కాలను పాటించడంతో పాటు విటమిన్ ఏ పుష్కలంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. క్యారెట్ , మునగాకు, పాలకూర వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల కంటి సమస్యలు తగ్గించుకోవడంలో చాలా బాగా సహాయపడుతాయి.