ప్రకృతి మనకు ప్రసాదించిన ఆకుకూరల్లో పొన్నగంటి కూర అతిముఖ్యమైనది. ఇప్పటి తరం పిల్లలు పది సంవత్సరాలకే సైట్ ప్రాబ్లం తో ఇబ్బంది పడుతున్నారు. కంటి సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడేవారు తరచూ పొన్నగంటి కూర ను ఆహారంలో తీసుకుంటే కొద్ది రోజులలోనే కళ్ళజోడు పెట్టుకొని అవసరం లేకుండా పోతుంది. పొన్నగంటి కూరను పూర్వం పోయిన కంటి కూర అని అనేవారట అది కాస్తా పొన్నగంటి కూరగా మారింది. పొన్నగంటి కూరలో మన శరీరానికి కావలసిన విటమిన్ ఏ, సి, B6, ఫోలేట్, రెబోఫ్లోవిన్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి.
దీర్ఘకాలంగా దగ్గు ఆస్తమాతో ఇబ్బందిపడేవారు పొన్నగంటి ఆకుల రసంలో వెల్లుల్లి రసం కలిపి తరచూ తీసుకుంటే చక్కటి ఉపశమనం కలుగుతుంది. పొన్నగంటి కూర మంచి డైట్ ఫుడ్ గా పనిచేస్తుంది. బరువు పెరగడానికి బరువు తగ్గడానికి రెండు రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. పొన్నగంటి కూరని ఉడికించి దానిలో ఉప్పు మిరియాలపొడి కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారని వైద్యులు చెబుతున్నారు. అలాగే బరువు తక్కువగా ఉన్నవారు కందిపప్పు నెయ్యితో పొన్నగంటి కూరను తీసుకుంటే బరువు పెరుగుతారు.
పొన్నగంటి ఆకులు లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటును తగ్గిస్తాయి. ఫలితంగా గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. పొన్నగంటి కూర లో లభించే కాల్షియం ఎముకల ఎదుగుదలకు ఆస్టియోపోరోసిస్ లాంటివి దూరం చేయడానికి సహాయపడుతుంది. కండరాలు పట్టేయడం నడుము నొప్పితో బాధపడేవారు తరచూ ఆహారంలో పొన్నగంటి కూరని తీసుకుంటే చక్కటి ఉపశమనం కలుగుతుంది.

పొన్నగంటి ఆకులలో ఉండే పీచు పదార్థం జీర్ణ ప్రక్రియను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను దూరం చూస్తుంది. దీనిలో రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించే గుణం ఉంది. మధుమేహం ఉన్నవారు తరచూ ఆహారంలో పొన్నగంటి కూర తింటే షుగర్ కంట్రోల్ అవ్వడమే కాక రక్తం శుద్ధి అవుతుంది.
పొన్నగంటి కూర శృంగార సమస్యలకు దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది. శృంగారం పట్ల ఆసక్తి లేకపోవడం అంగస్తంభన వంటి లైంగిక సమస్యలతో బాధపడేవారు ఆహారంలో పొన్నగంటి కురను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాక వీర్య వృద్ధి జరిగి సంతాన సాఫల్యం కూడా కలుగుతుంది

ఆవు నెయ్యితో పొన్నగంటి కూరను కలుపుకొని తింటే మొలల వ్యాధి నయమవుతుంది. తరచుగా దీనిని ఆహారంలో భాగంగా చేసుకుంటే చర్మంపై మృతకణాలు తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది. పొన్నగంటి ఆకులను కూరగా తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి సీజనల్గా వచ్చే అనేక వ్యాధులుదరిచేరకుండా ఉంటాయి. దీనిని తరచూ తినడం వలన క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం చాలా తక్కువ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకోవడానికి మా పేజీని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి