Face Glow in Overnight tips by mantena satyanarayana

ముఖాన్ని కాంతివంతంగా మెరిపించాలంటే?

అందమైన చర్మం కోసం మనం మార్కెట్లో దొరికే చాలా రకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటాం. వాటివల్ల వచ్చే దుష్ప్రభావాలను కూడా ఎదుర్కొంటాం. కానీ సరైన ఫలితం లేక బాధపడుతుంటాం. చాలామందికి చర్మం డల్ గా, నిర్జీవంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలతో మన స్కిన్ని అందంగా ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. 

దానికోసం రోజూ ఉదయం లేవగానే ఒక లీటరు నీటిని తాగాలి మళ్లీ కొంతసేపటి తర్వాత స్నానానికి వెళ్ళే లోపు ఇంకో లెటర్ నీటిని తాగాలి. ఇలా కనీసం రోదలో మూడున్నర లీటర్ల నీటిని తాగడం వలన శరీరంలో ఉండే విషవ్యర్థాలను బయటకు పంపుతుంది. అంతేకాకుండా మూత్రవిసర్జన, మల విసర్జన సాఫీగా జరుగుతుంది.

 నీళ్లు బాగా తాగడం వల్ల శరీరంలో ఉండే టాక్సిన్లు బయటకు పోయి చర్మం కాంతివంతంగా మొటిమలు, మచ్చలు రహితంగా ఉంటుంది. అంతేకాకుండా  ఆహారంలో కూరగాయలు పండ్లను భాగం చేసుకోవాలి. ఉడికించిన వాటికంటే ఉడికించని.కూరగాయలు పండ్లు శరీరానికి మేలు చేస్తాయి. రోజులో ఒక పూట పచ్చి కాయ కూరలు లేదా పండ్లు తినాలి. 

మొలకలు ,పండ్ల ముక్కలు ఒక పూట కడుపునిండా తినడం వల్ల వంట చేసే సమయం తగ్గడంతో పాటు శరీరంలో ఉప్పు, కారం, మసాలాలు  తగ్గుతాయి. దీనివల్ల జీర్ణ వ్యవస్థ శుభ్రపడి శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. రక్తంలో మలినాలు, కొవ్వు తగ్గడం వలన చర్మం కాంతివంతంగా తయారవుతుంది. 

కూరగాయలు పచ్చివి తీసుకోలేనప్పుడు ఉదయాన్నే రెండు క్యారెట్లు, ఒక కీర, ఒక బీట్ రూట్ మొక్క మిక్సీ పట్టి ఆ రసాన్ని వడ కట్టాలి ఇలా వడకట్టిన జ్యూస్ లో అర చెక్క నిమ్మరసం పిండి తీసుకోవడం వల్ల శరీరం అందంగా మెరవడం మొదలవుతుంది. ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటే వచ్చే అద్భుతమైన ఫలితాలను మీరే గమనిస్తారు.

 అలాగే ఉదయం లేదా సాయంత్రం విటమిన్ సి ఉండే జ్యూస్ తాగడం మంచిది. కమల, బత్తాయి వంటి జ్యూస్లు ఉదయం ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు తీసుకోవాలి. విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి.

 ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. నాన్ వెజ్ , మసాలా, జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. కనీసం ఏడు గంటలపాటు  మంచి నిద్రతో పాటు పైన చెప్పినవన్నీ చేయడం వలన అందమైన ఆరోగ్యకరమైన  చర్మం మీ సొంతం అవుతుంది

Leave a Comment

error: Content is protected !!