face glowing tips with coconut oil

కొబ్బరి నూనెలో ఈ టాబ్లెట్ కలిపి రాస్తే చాలు……. నీ ముఖం చాలా మెరిసిపోతుంది…….. మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది…

చాలామందికి ముఖంపై నల్లటి మచ్చలు, వలయాలు, పింపుల్స్ తాలూకా గుంటలు, మరియు పింపుల్స్ ఎక్కువగా ఉండి బయటికి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటికోసం పార్లర్ చూట్టు తిరగవలసి వస్తుంది. అయినా మంచి ఫలితాలు ఉండటం మరియు ఎన్ని ప్రొడక్ట్స్ ఉపయోగించిన వాటి కెమికల్ ఎఫెక్ట్ వలన ముఖం ఇంకా పాడైపోతుంది. అంతేకాకుండా ఎన్ని హోమ్ రెమిడీస్ ఉపయోగించిన ఫలితం లేదు అనుకున్నవారు ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే రెమిడి ఉపయోగించడం వలన మంచి ఫలితం ఉంటుంది.

                     ఇది ఉపయోగించడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందువల్ల చిన్నవారి నుంచి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు. దీని కోసం మనం ముందుగా ఒక చిన్న గిన్నెను తీసుకోవాలి. అందులో ఒక స్పూన్ స్వచ్ఛమైన కొబ్బరినూనెను వేసుకోవాలి. దీనికోసం వీలైతే గానుగ పట్టించిన కొబ్బరి నూనె ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది అంతేకాకుండా మన ముఖంలో ఉండే తేమను బయటకు తీసుకొస్తుంది. ఆ తర్వాత ఇందులో విటమిన్ ఇ టాబ్లెట్ సిరంను వేసుకోవాలి. ఇందులో ఉండే విటమిన్ ఇ మనం ముఖం యొక్క తేజస్సును పెంచడానికి సహాయపడుతుంది.

                        ఆ తర్వాత ఒక స్పూన్ నిమ్మరసం కలుపుకోవాలి. నిమ్మరసం మన చర్మంపై ఉన్న మృత కణాలు తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా చర్మం ఫ్రెష్ గా ఉంచుతుంది. ఆ తర్వాత ఒక చిటికెడు పసుపు కలుపుకోవాలి. పసుపు ఆంటీబయాటిక్ కనుక మన ముఖంపై ఉన్న పింపుల్స్ తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా బ్యాక్టీరియా వలన వచ్చే ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. అంతేకాకుండా ముఖం యొక్క తేజస్సును పెంచడంలో సహాయపడుతుంది. ఇప్పుడు ఈ నాలుగింటి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.

                 ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మన ముఖానికి బాగా అప్లై చేసి పది నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం ద్వారా మిశ్రమంలో ఉన్న న్యూట్రిషన్స్ అన్ని మన ముఖానికి బాగా అందుతాయి. అంతేకాకుండా మృతకణాలు తొలగించబడతాయి. ఇలా చేసిన తర్వాత మనం ఉపయోగించే ఏదైనా సబ్బుతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముఖమును పరిశీలిస్తే చాలా తేడా కనిపిస్తుంది. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం ద్వారా మన ముఖం యొక్క తేజస్సుతోపాటు, కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది

Leave a Comment

error: Content is protected !!