ఆడవాళ్ళం అందం గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటాం. పార్లర్లో వందలు, వేలు ఖర్చుపెడుతుంటాం. కానీ ఇంట్లో నిత్యం వాడే పదార్థాలతో చేసే చిట్కాలు కూడా మన చర్మానికి మంచి మెరుపుని ఇస్తాయని మీకు తెలుసా. ఏ స్కిన్ ట్రీట్మెంట్ అయినా చర్మం రంగుని మార్చలేదు. కానీ ఆరోగ్యంగా మార్చి మంచి నిగారింపు అందిస్తాయి. అలాంటి ఒక ఫేషియల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఫేషియల్ చేసినప్పుడు మంచి ఫలితాల కోసం చర్మాన్ని మొదట క్లెన్సింగ్ చేయాలి. తర్వాత స్క్రబ్, తర్వాత ఫేస్ పేక్ వేయాలి.
క్లెన్సింగ్ :- కాచి చల్లార్చిన పాలలో కొన్ని చుక్కలు నిమ్మరసం వేయడం వలన పాలు కొంచెం విరిగినట్టు అవుతాయి. దీనిలో దూది ముంచి ముఖాన్ని, మెడభాగాన్ని శుభ్రపరచాలి. దీనివలన ముఖం, మెడపై ఉండే మురికి, దుమ్ము తొలగి చర్మం శుభ్రపడుతుంది.
స్క్రబ్ :- పాలల్లో కొంచెం సాల్ట్ వేసి కలపాలి. తర్వాత ఇంతకుముందులానే దూదిలో ముంచి చర్మంపై మృదువుగా స్క్రబ్ చేయాలి. దీనివలన ముక్కు, గడ్డం, కిందపెదవికి మధ్య చర్మంపై ఉండే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. చర్మంలో తయారయ్యే నూనెతో చేరి చర్మకణాలను మూసివేసిన మురికి స్క్రబ్ చేయడం వలన తొలగిపోయి చర్మంలో తయారయ్యే నూనెలు అదుపులోకి వచ్చి చర్మం తాజాగా ఉంటుంది.
ఫేస్ పాక్ :- ఫేస్ పేక్ కోసం మనం ఇష్టంగా తినే డ్రాగన్ ఫ్రూట్ యొక్క తోలు తీసుకోవాలి. దానిపైన ఉండే మురికిని శుభ్రంగా కడిగి, పైన కొంచం బొడిపెలు తీసేయాలి. తర్వాత చిన్న ముక్కలుగా కోసి పాలతో మెత్తటి ఫేస్ట్ చేసుకోవాలి. ఈ ఫేస్ట్ మంచి పింక్ కలర్లో ఉంటుంది. దీనిని ముఖానికి కింద నుంచి పైకి పేక్ లా మందంగా వేసుకోవాలి. పేక్ ఆరేంతవరకూ ఉండి మామూలు చల్లనినీళ్ళతో కడిగేయాలి. పేక్ ఉన్నంతవరకు నవ్వడం, మాట్లాడటం చేయకూడదు. దీనివలన స్కిన్ టైట్ అయి ముడతలు తగ్గుతాయి.
ఫేషియల్ అయిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయడం వలన అప్పటి వరకూ చర్మం కోల్పోయిన తేమ తిరిగి అందుతుంది. మొత్తం ఈ ఫేషియల్ వలన చర్మంపై మురికి తొలగి మంచి నిగారింపు సొంతం చేసుకుంటుంది. మృదువుగా కూడా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా శ్రద్ధ తీసుకోవడం వలన చర్మం ఆరోగ్యంగా మారుతుంది. సహజమైన అందం మీ సొంతమవుతుంది.
ఈ ఫేషియల్ గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.