నాగజెముడు చెట్టు ఇసుక ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే పుష్పించే ఎడారిమొక్క. తక్కువ నీటితో ఎక్కువ రోజులు బతుకుతూ చెట్టు నిండా ముళ్ళతో, పడగవిప్పిన పాముపడగలా భయంకరంగా ఉంటుంది. కానీ దీనికి ఎర్రగా ఉండే పండ్లు మాత్రం అనేక పోషకాలను కలిగి ఉంటాయి. దీనిలో ఉండే పోషకాలు గురించి తెలిస్తే తప్పక తినాలి అనుకుంటారు. విదేశాల్లో ఆహారంలో భాగంగా వీటి పండ్లను ఉపయోగిస్తారు. ఇందులో అనేక రకాల కాక్టస్ జాతి మొక్కలు ఉన్నాయి. మన దేశంలో దొరికే మొక్కను ఇండియన్ కాక్టస్ లేదా నాగజెముడు అంటారు. పూర్వం పిల్లలు ఈ పండ్లను తిని ఎర్రగా మారిన నాలుకలు చూసి సంబరపడేవారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి
ముళ్ళ నుండి జాగ్రత్తగా సేకరించి తినొచ్చు. పైన ఉండే తోలును తొలగించి లోపలి గుజ్జుని తిని విత్తనాలు పడేయాలి. విటమిన్ సి అధికంగా ఉంటుంది.యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడంవలన తెల్లరక్తకణాలను వృద్ధి చేసేందుకు పనిచేస్తుంది. జీవక్రియ రేటును పెంచి రోగనిరోధక వ్యవస్థ ను పటిష్టం చేస్తుంది. దానివలన సీజనల్ ఫ్లూ, జ్వరాలు నుండి రక్షిస్తుంది. ఈ పండులో కాల్షియం అధికంగా ఉండి ఎముకలను ఆరోగ్యంగా, పెలుసుబారకుండా చేస్తుంది. ఇది పిల్లలకు ఎదుగుదలలో సహాయపడుతుంది. జ్ఞాపకశక్తి ని పెంచుతుంది. పెద్దలకు వయసుతో పాటు వచ్చే అల్జీమర్స్, డిమెన్షియా నుండి కాపాడుతుంది.
ఈ పండులో విటమిన్ ఇ, కె, సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండి చర్మ సౌందర్యాన్ని కాపాడుతాయి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడి చర్మ సంబంధ సమస్యలు రాకుండా చేస్తాయి. దీనిలో అధికంగా ఉండే డైటరీ ఫైబర్ తిన్న ఆహారాన్ని జీర్ణంచేసి మలబద్దకాన్ని తగ్గిస్తుంది. కోలన్ కాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది.మన శరీరంలో పెరిగే చెడుకొవ్వును కరిగించి మంచి కొవ్వు ను పెంచుతాయి. శరీరంలోని ఫ్రీరాడికల్స్ను అడ్డుకుని కాన్సర్ రాకుండా చేస్తాయి. ఇందులో పోషకాలు అధికంగా, కాలరీస్ తక్కువగా ఉండి బరువు తగ్గడానికి సహాయపడతాయి. మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది.
లివర్లోని విషవ్యర్థాలను తొలగించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారు ఈ పండు క్రమంతప్పకుండా తినడం వలన తలనొప్పి శాశ్వతంగా తగ్గుతుంది. రక్తప్రసరణ మెరుగపడి జుట్టు, చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటాయి. గోర్లు అందంగా పెరిగేలా చేస్తుంది. సంతానం లేనివారికి వీర్యకణాల వృద్ధి పెంచుతుంది. శృంగారంపై ఆసక్తి పెరిగేలా చేస్తుంది. ఆరోగ్యానికి ఇంతగా సహాయపడే ఈ పండ్లు విదేశాల నుండి దిగుమతి చేసుకోబడి సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి. పల్లెల్లో అందుబాటులో ఉంటే జాగ్రత్తగా పాటిస్తూ ఈ పండును తినిచూడండి.