అందరికీ జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. మనం తీసుకునే ఆహారం వాతావరణ పరిస్థితులు అనారోగ్య సమస్యలు వంటి కారణాల వలన జుట్టు రాలడం సమస్య బాగా ఎక్కువగా ఉంటుంది. తగ్గించుకోవడానికి రకరకాల ఆయిల్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. జుట్టు రాలడం సమస్య ను తగ్గించుకోవడానికి కొంతమంది మందులను కూడా ఉపయోగిస్తారు. కానీ మందులు ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగదు.
కొందరికి జుట్టు పలుచగా, పొట్టిగా, చివర్లు చిట్లి పోయి ఉంటుంది. తల స్నానం చేసినప్పుడు ఎక్కువ జుట్టు రాలడం జరుగుతుంది. ఇటువంటి సమస్యలను తగ్గించుకోవడం కోసం ఈ హెయిర్ టానిక్ ఉపయోగించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఈ టానిక్ తయారు చేసుకోవడానికి మనం ముందుగా కలబంద మట్ట తీసుకుని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగి అంచులను కట్ చేసుకుని లోపల ఉన్న గుజ్జును తీసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని మీ జుట్టుకు సరిపడినంత అలోవెరా తీసుకోవాలి.
2 ఇంచుల అల్లం తీసుకొని తురుముకొని దాని నుండి జ్యూస్ తీసి వడకట్టుకోవాలి. అలోవెరా జెల్ ఎంత తీసుకున్నామో అల్లం రసం కూడా అంతే తీసుకోవాలి. తర్వాత ఒక చెంచా కాఫీ పౌడర్ వేసుకోవాలి. దీనిలో మూడు చెంచాల కొబ్బరి నూనె వేసుకోవాలి. కొబ్బరి నూనె వద్దు అనుకున్న వాళ్లు క్యాస్టర్ ఆయిల్ లేదా బాదం నూనె లేదా ఏదైనా మీకు నచ్చిన నూనె వేసుకోవచ్చు.
వీటన్నిటినీ బాగా కలుపుకొని జుట్టు కుదుళ్ల నుండి అప్లై చేసుకోవాలి. జుట్టు మొత్తానికి అప్లై చేసిన చెయ్యకపోయినా స్కాల్ప్ పైన బాగా అప్లై చేసి 15 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లు బలంగా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. రాలిన జుట్టును తిరిగి వచ్చేలా చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. జుట్టు పొట్టిగా పలుచగా ఉన్న జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలోవెరా జెల్ జుట్టు కుదుళ్లు బలంగా చేసి జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.
అల్లం రసం ఏంటీ ఆక్సిడెంట్స్, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. దీనివలన చుండ్రు, జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడంలో సహాయపడుతుంది. జుట్టు పొట్టిగా, పలుచగా ఉంది అనుకున్న వారు ఒకసారి ఈ చిట్కాను ట్రై చేయండి. చాలా బాగా పని చేస్తుంది.