జుట్టు ఊడడానికి గల కారణాలు మొదటిది మగవారికి బట్టతల వస్తుంది. మగవారికి ఆడవారికంటే ఎక్కువగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే టెస్టోస్టిరాన్ ఎక్స్ప్రెషన్ అనేది జుట్టు కుదుళ్ల పై పడి జుట్టు ఊడిపోవడానికి కారణం అవుతుంది. ఇక రెండవది ఆడవారిలో ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గిపోవడం వల్ల పీసీఓడీ లాంటి సమస్యలు ఉండడం వల్ల జుట్టు ఎక్కువ రాలిపోతుంది. మూడవది తలలో చుండ్రు, ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. నాలుగవది పోషకాహార లోపం వల్ల జుట్టు ఊడిపోవడం. ముఖ్యంగా ప్రోటీన్ డెఫిషియన్సీ 100 మందిలో 90 మందికి ఉంది.
దీనివల్ల ఊడిని ప్లేస్ లో జుట్టు రాదు జుట్టు సరిగా ఎదగదు. ఐదవది ప్రెగ్నెన్సీ సమయంలో ముఖ్యంగా మనోపాస్ సమయంలో హార్మోనల్ ఫ్లక్చువేషన్ వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. ఆరవది కొంతమందికి చర్మవ్యాధులు తలలో వస్తూ ఉంటాయి సోరియాసిస్ లాంటివి దానివల్ల కూడా ఊడిపోతుంది ఏడవది మెడిటేషన్ వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. ఎనిమిదవది వాతావరణం లో వేడికి, రేడియేషన్ కి రాలిపోతుంది. తొమ్మిదోది హెయిర్ ట్రీట్మెంట్స్ కోసం బావుండాలని జల్సు క్రీమ్స్ వాడుతూ ఉంటారు దీని వల్ల కూడా ఊడిపోతుంది. పదవది జుట్టుకి షాంపూలు వాడటం వల్ల కెమికల్ రియాక్షన్ వల్ల, 11వది తలకి వేడి నీళ్లు పోసుకోవడం వల్ల జుట్టు బాగా రాలిపోతుంది.
12వది మానసిక ఒత్తిడి ఎక్కువైనప్పుడు జుట్టు ఎక్కువ రాలిపోతుంది. 13వ అది చూస్తే కొంత మంది డైటింగ్లు చేస్తారు దీనివల్ల పోషకాహార లోపం ఎక్కువయి జుట్టు ఊడిపోతుంది. ఇక చివరిది 14వ ది జీన్స్ బట్టి కూడా జుట్టు ఊడిపోవడం జరుగుతుంది. జుట్టు ఊడకుండా ఉండాలంటే తలలో మర్దన చేస్తూ చన్నీళ్ల తల స్నానం చేస్తే మంచిది. తలలో పేలు లేకుండా చూసుకోవాలి. ఇవి పోషకాలను లాగేసుకుంటాయి. ఆహారము ప్రధానంగా ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. జుట్టు పెరగడానికి బాగా ఉపయోగపడేది బాదంపప్పు వీటిని ఒక 10 నానబెట్టుకుని తింటే చాలా మంచిది. దీనితోపాటు పుచ్చ గింజల పప్పును కూడా తింటే మంచిది ఇది హై ప్రోటీన్ ఫుడ్.
వీటితోపాటు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల బ్లడ్ సప్లై బాగుంటుంది. మధ్యాహ్నం పూట సోయా చిక్కుడు గింజలను నానబెట్టుకుని కూరలో వేసుకోవడం మంచిది. రెగ్యులర్గా ఆకుకూరలు ఎక్కువ తినడం వల్ల జుట్టుకి చాలా మంచిది.