జుట్టు సమస్యలు తగ్గించుకోవడానికి అమ్మమ్మల కాలం నాటి చిట్కాలు చాలా బాగా పనిచేస్తుంటాయి. కానీ వీటిని తయారు చేయడానికి పట్టణాల్లో ఉండే వారికి అన్ని రకాల ఆకులు, ఔషధాలు అందుబాటులో ఉండవు. మీరు ఏవైనా అందుబాటులో ఉంటే తాజా వాటితో ఈ చిట్కాను తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు మనం చిట్కా కోసం తీసుకోవాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. కొబ్బరి నూనె, మందార పువ్వు పొడి, మందార ఆకుల పొడి, కరివేపాకు, ఉసిరికాయల పొడి. ఈ పొడులన్నీ అన్ని ఆన్లైన్, సూపర్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.
ఇప్పుడు స్టవ్ మీద నూనెను పెట్టి తీసుకున్న పదార్ధాలన్నీ అందులో వేసుకోవాలి. అరకప్పు నూనెకు ఒక స్పూన్ చొప్పున పదార్థాలు వేసుకుని కావలసినంత మోతాదులో నూనెను తయారు చేసుకోవచ్చు. తరువాత స్టవ్ ఆపేసి నూనెను చల్లారనివ్వాలి. ఈ నూనెను వడకట్టుకొని తలకు అప్లై చేసుకొని మరుసటి రోజు తలస్నానం చేయవచ్చు. ఇందులో వాడిన పదార్థాలన్నీ పూర్వం నుంచి జుట్టు సంరక్షణలో మన పెద్దలు ఉపయోగించినవే. వీటివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
ఇందులో వాడిన ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మందార ఆకులు, మందార పువ్వులు, జుట్టు సంరక్షణకు, జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి జుట్టును మృదువుగా దృఢంగా పెరిగేందుకు, చుండ్రు సమస్యను నివారించేందుకు సహాయపడతాయి. తలలోని చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు మందార ఆకులు చాలా బాగా సహకరిస్తాయి. కరివేపాకులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ను తగ్గించి జుట్టు పెరుగుదలను పెంచుతాయి.
జుట్టు రాలే సమస్యను జుట్టు నల్లగా మెరిసేలా చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది. మీకు ఇప్పుడు చెప్పిన పదార్థాలన్నీ అందుబాటులో ఉంటే పచ్చివి వాడుకోవచ్చు. సిటీస్లో ఇవేమీ దొరకని వారు ఆన్లైన్లో కొనుక్కొని తయారు చేసుకోవడం ద్వారా వాటి ప్రయోజనాలను పొందవచ్చు. నాచురల్ పదార్థాలు ఏమైనా ఉపయోగించినప్పుడు 1 లేదా 2 రోజులలో వాటివలన ఏవైనా దుష్ప్రభావాలు ఉంటే బయట పడతాయి. వాటిని మానేయడం మంచిది.
కానీ కెమికల్స్తో తయారు చేసిన నూనె వాడడం వలన వచ్చే దుష్ప్రభావాలు నుండి బయటపడడానికి సమయం పడుతుంది. వీటి నుండి బయట పడటం కష్టం. అందుకే ప్రకృతి సహజమైన పదార్థాలు జీవన విధానంలో భాగం చేసుకోవాలి.