ఎవరినీ అడిగిన జుట్టు రాలడం అనేది సామాన్య సమస్యగా తయారయ్యింది. వీటికి వాతావరణ కాలుష్యం ఒక కారణం అయితే అనారోగ్యం మరో కారణం. హార్మోనల్ , థైరాయిడ్-లాంటి సమస్యలు, ఒత్తిడి ఆందోళన లాంటివి జుట్టురాలటంలో ప్రధానపాత్ర వహిస్తుంది. ఇవి కాకుండా మన చేతులారా చేసుకొనే అతి పెద్ద పొరపాటు మార్కెట్లో కొత్తగా ఏ ప్రొడక్ట్ వచ్చిన మన మీద ప్రయోగం చేసుకోవటం. అందులోనీ కెమికల్ మన జుట్టు మీద ఎంత చెడు పరిణామం కలిగిస్తుంది అని కూడా ఆలోచించకపోవటం.
సరే ముందు మనం ఈ రోజు రెమిడీ ఏంటో చూసేద్దాం. తర్వాత వాటి ప్రయోజనం ఏంటీ తెలుసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా వేప ఆకులు తీసుకుందాం, వాటిని శుభ్రంగా కడిగి చిన్న మిక్సి గిన్నెలో వేసుకొని కొంచెమే నీళ్ళు వేసి సుమారుగా పేస్ట్ రూపంలో రుబ్బుకోవాలి. ఒక గిన్నెలో వేపఆకుల పేస్ట్ వేసి అందులో స్వఛ్చమైన కొబ్బరి నూనె వేసుకొని డబుల్ బాయిలింగ్ విధానంలో నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఫిల్టర్ చేసి చిన్న గాజు సీసాలో వేసుకోవాలి. గాజు సీసాలో ఉన్న ఏ పదార్థమైన ఎక్కువ రోజులు నిలువుంటుంది కాబట్టి ఇంటి వైద్యంలో గాజు సీసాలు వాడుకోండి.
ఇలా తయారు చేసుకున్న నూనెను వారానికి రెండు సార్లు కుదుళ్ళనుండి జుట్టు చివరిదాకా పట్టించి బాగా ఒక అరగంట మర్దనం చేసుకోవాలి.
ఇందులో వేప ఆకులు వాడిన కారణాలు మరి ఉపయోగాలు.
-వేపలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లాంటి రోగ నిరోధక లక్షణాలు ఉండటం వలన మనం అన్ని విధాలుగా వేపను ఉపయోగించవచ్చు.
– వేపలో విటమిన్ సి, ఇ మరియు కేరాటిన్ అంశాలు సమృద్దిగా ఉంది కాబట్టి ఇవి జుట్టు రాలిపోతున్న సమస్యకు సులభ పరిహారం.
– వేపలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ చుండ్రు, దద్దుర్లు, దురద, పెనులు రాకుండా కాపాడుతుంది.
– వేప యాంటీ ఇన్ఫ్లేమేటరీ, యాంటీ ఏజింగ్ గుణాలు కలిగిఉండే ఖజానా అన్న తప్పులేదు.
– వేప కేవలం ఆకులు కొమ్మలు అని కాకుండా సమూలంగా ఉపయోగపడే దివ్య ఔషధం. వేప కేవలం జుట్టు కోసమే కాదు అన్ని రకాల ఆరోగ్య సూత్రాల్లో వేపను సమృద్దిగా వాడవచ్చును. ఈ రోజు జుట్టు పెరుగుదలలో వేప ఎంత సహాయపడుతుంది అని తెలుసుకున్నాం. పైన చెప్పిన విధానంలో రెమిడీ తయారు చేసి వారానికి రెండు సార్లు వాడినట్టైతే మంచి ఫలితం చూస్తారు.