Onion Oil Faster Hair Growth In 15 Days

ఉల్లిపాయలో ఇది 1 కలిపి రాస్తేచాలు పలచగా ఉన్నజుట్టు చాలా ఒత్తుగా,పొడవుగా,నల్లగా మారుతుంది.

హలో ఫ్రెండ్స్ చాలామంది మన జుట్టు ఆరోగ్యం కోసం మార్కెట్లో దొరికే ఆయిల్స్  ఎక్కువగా వాడుతుంటారు. వాటి ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కానీ వందలు వేలు ఖర్చుపెట్టి కొనాల్సి వస్తూ ఉంటుంది. అలాంటివారు ఖరీదైన ఆయిల్స్ కొనుక్కునే బదులు మన ఇంట్లో నే సహజ సిద్ధంగా దొరికే పదార్థాలతోనే ఒక అద్భుతమైన హెయిర్ ఆయిల్ ను తయారు చేసుకోవచ్చు ముఖ్యంగా ఎటువంటి కెమికల్స్ వాడకుండా. అలాంటి ఒక ఆయుర్వేదిక్ చిట్కా గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.

ఈ రెమిడి తయారీ విధానం

ముందుగా పింక్ కలర్ లో ఉండే రెండు ఉల్లిపాయలను తీసుకొని పైన పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి. వీటిని ఒక మిక్సీ జార్ లో వేసి మెత్తటి పేస్ట్లా తయారుచేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ఫ్యాన్ నుంచి 50 గ్రాముల ఆవనూనెను ఇందులో వేయండి. (ఆవనూనెనుకు బదులు కొబ్బరి నూనెను వాడుకోవచ్చు) ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ పేస్ట్ను ఇందులో వేయండి. స్టవ్ సిమ్ లో ఉంచుకొని ఒక ఇరవై నిమిషాలు ఈ మిశ్రమాన్ని నూనెలో బాగా వేయించండి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని రాత్రంతా అలాగే ఉంచండి.

ఉల్లిపాయని నూనెతో కలిపి మన జుట్టుకు రాసుకుంటే 90% జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. మిగతా 10% మీరు వాడే డైట్ మీద ఆధారపడి ఉంటుంది. ఉల్లిపాయలో ఉండే పోషకాలు మన జుట్టు రాలడాన్ని అరికడుతుంది. ఉల్లిపాయలు కొన్ని ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి ఇవి మన జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇందులో ఉండే సల్ఫర్ మన జుట్టుకు తగినంత పోషణను అందించి మన జుట్టు పొడవుగా హెల్తీగా పెరిగేటట్లు చేస్తుంది. అంతే కాదు ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జుట్టు కుదుళ్లు దృఢంగా మారుతాయి.

ఈ రెమిడీ ఎలా వాడాలి..

ఉదయాన్నే ఈ నూనెను వేరొక బౌల్ లోకి వడపోసి మీ జుట్టుకు కుదుళ్లకు పట్టించి బాగా మర్దన చేయండి.తరువాత రెండు నుంచి మూడు గంటలు అలాగే ఆరనివ్వాలి. తర్వాత మీకు నచ్చిన మైల్డ్ రెగ్యులర్ షాంపుతో తలస్నానం చేయండి. మీకు ఉల్లిపాయ స్మైల్ పడకపోతే ఇందులో మీకు నచ్చిన ఏదైనా ఎసెన్షియల్ రెండు మూడు చుక్కలు కలుపుకుని వాడుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!