పుదీనా మొక్కలను మన ఇంట్లో కుండీలలోని పెరట్లో ను ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. పుదీనా ఆకులను గిల్లుతుంటే కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. వీటిని ప్రతినిత్యం వంటలలో గాని, తాలింపులో గాని, వంట అయిపోయిన తర్వాత గాని లేదా భోజనాలు తినే ముందు కానీ ఆకులను జల్లుకుని తింటే వీటి వలన చాలా లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా మూడు ముఖ్యమైన లాభాలు ఉంటాయని సైంటిఫిక్ గా నిరూపించబడింది. 2018 సం లో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ ఆంబ్రీయా ఇంగ్లాండ్ వారు దీనిపై రీఛార్జ్ చేశారు. పుదీనాలో ముఖ్యమైనదిగా సువాసన.
పుదీనా ఎక్కువగా కొత్తిమీర చల్లుతూ ఉంటాం, మరియు వంటలలో ఉడికేటప్పుడు వేస్తాం, పుదీనా జ్యూస్ కింద చేసి కూడా వంటలలో ఉపయోగించవచ్చు. దీనికి ఉండే స్పెషల్ వాసన కాగ్నిటివ్ ఫంక్షన్ అంటారు. బ్రెయిన్ లో ఆలోచన శక్తి, కాస్త నిర్ణయం తీసుకునే శక్తి, అర్థం చేసే శక్తి, విచక్షణ శక్తి ఇటువంటివి ఉంటాయి. దీన్ని బట్టి మన ఎఫిషియన్సీ ఆధారపడి ఉంటుంది. వీటన్నిటిని ఇంప్రూవ్ చేయడానికి పుదీనా ఆకుల్లో ఉండే వాసన సహాయపడుతుంది. అంటే ఇలాంటి విషయాల్లో బ్రెయిన్ బాగా యాక్టివేట్ చేయడానికి, చాలా షార్ప్ గా పని చేయడానికి పుదీనా స్పెషల్ ఫలితాలు ఇస్తుంది అని సైంటిఫిక్ గా ఉంది.
కాబట్టి పుదీనాను ఎక్కువగా ఇలా ఉపయోగించడం, దాని ఫ్లేవర్ ఎక్కువగా తీసుకోవడం, దాని యొక్క వాసన పచ్చిగా రోటి పచ్చడి వంటి వాటిల్లో ఉపయోగించడం చాలా మంచి పద్ధతి. రెండవదిగా తీసుకుంటే పుదీనాలో 4248 ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ ఎ ఉంటుంది. అంటే ఇది ఆకులలో బీటా కెరోటిన్ గా ఉంటుంది. మన పొట్టలోకి వెళ్ళాక విటమిన్ ఎ గా మారుతుంది. ఈ 4248 ఇంటర్నేషనల్ యూనిట్స్ బీటా కెరోటిన్ అనేది పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తాయి.
ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి. మూడోదిగా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పుదీనాలో ఉండే ఫైబర్ గుడ్ బ్యాక్టీరియా పెరుగుదలకు ఉపయోగపడి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి మూడు ఫలితాలు మనం పొందడానికి పుదీనాను మనం వాడుకుంటే అటు కంటికి, ఇటు ఒంటికి ఈ రూపాల్లో చక్కటి లాభాలు కూడా పొందవచ్చు….