fat burning oil homemade in telugu

ఎటువంటి డైట్ జిమ్ లేకుండా రాత్రికి రాత్రి మీ పొట్ట నడుము చుట్టూ ఉండే కొవ్వును కరిగించే అద్భుతమైన ఫ్యాట్ బర్నింగ్ ఆయిల్

సరైన వ్యాయామం లేపోవడం, ఆహారపు అలవాట్లు లేకపోవడం లేదా డెలివరీ అయిన తర్వాత పొట్ట,  శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల అధిక బరువు సమస్య ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. చాలామందిలో కొద్ది ప్రదేశాల్లో మాత్రమేఅంటే పిరుదులు, పొట్ట, తొడలు చుట్టూ కొవ్వు ఎక్కువగా పేరుకొని చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి వారు తక్కువ ఖర్చుతో కొవ్వు కరిగించుకోవడానికి ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. ఆహారపు అలవాట్లలో మార్పులు, కొద్దిపాటి వ్యాయామంతో పాటు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను ఉపయోగించడం వల్ల తక్కువ సమయంలోనే అధిక బరువును తగ్గించుకోవచ్చు.

 దాని కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలలో మొదటిది ఆవనూనె. ఆవ నూనె ఒక కప్పు ఐరన్ పాన్లో వేసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ వాము కూడా వేసుకోవాలి. వాము శరీరంలో కొవ్వును కరిగించడంలో చాలా బాగా పనిచేస్తుంది. వాము శరీరంలోని మెటబాలిజంను సరిచేస్తుంది. తర్వాత పదార్థం దాల్చినచెక్క. దాల్చిన చెక్క పైపూతగా వేసినప్పుడు శరీరంలో ఉష్ణాన్ని కలిగించి కొవ్వును కరిగించేందుకు సహాయపడుతుంది. ఇప్పుడు నూనెను చిన్నమంటపై మరిగించాలి మరుగుతున్నప్పుడు నూనె నురగ పొంగుతుంది. 

నూనెను కలుపుతూ ఉండడం వల్ల బయటకు రాకుండా ఆపవచ్చు. తర్వాత నూనె రంగు మారగానే స్టవ్ ఆపేసి స్ట్రెయినర్ తో వడకట్టుకోవాలి. తర్వాత ఈ నూనెను  ఒక గాజుపాత్రలో స్టోర్ చేసుకోవచ్చు. ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. ఈ నూనెను వాడుకునేటప్పుడు మైక్రోవేవ్ ఓవెన్ ఉంటె అందులో వేడి చేసుకోవచ్చు. లేదంటే డబుల్ బాయిలింగ్ పద్ధతిలో ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టి చిన్న గిన్నెతో నూనెను వేడి చేసుకోవచ్చు. 

తర్వాత ఈ నూనెలో ఒక స్పూన్ అల్లం రసం కలుపుకోవాలి. అల్లం రసం కూడా కొవ్వు కరిగించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఏ ప్రదేశంలో అయితే కొవ్వు ఎక్కువగా పేరుకు పోయిందో ఆ ప్రదేశంలో ఈ నూనెతో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా తక్కువ సమయంలోనే కొవ్వు కరిగి అధిక బరువు సమస్య తగ్గుతుంది. తరుచుగా చేయడం వలన శరీరం మంచి ఆకృతిలోనికి వస్తుంది.

Leave a Comment

error: Content is protected !!