Fatigue Immunity Manthenas HealthTips

సెలైన్ ఎక్కిస్తే ఎంత బలం వస్తుందో ఒక గ్లాస్ దీని తాగినా కూడా అంతే బలం వస్తుంది……

 కొంతమందికి వాంతింగ్స్ అవుతూ ఉంటాయి. మరి కొంతమందికి మోషన్స్ అవుతూ ఉంటాయి. ఇలా వాంతులు  మరియు  మోషన్స్  కొంతమందికి ఇది ఉంటే అది ఉండదు అది ఉంటే  ఇది ఉండదు. కొంత మందికి రెండు లక్షణాలు ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు శరీరంలో ఉన్న వాటర్ లాస్ ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు మినరల్స్ కూడా వాటర్ తో ఎక్కువ లాస్ అవుతూ ఉంటాయి. దీని ద్వారా శరీరం లోపల డీహైడ్రేషన్ వచ్చి విపరీతమైన నీరసం వస్తుంది. దీనివల్ల ఒక్కొక్కసారి బిపి డౌన్ అయిపోతుంది. కళ్ళు కూడా తిరుగుతాయి, ఎక్కువ డిహైడ్రేషన్ అయినప్పుడు ఒక్కొక్కసారి స్పృహ తప్పుతారు. ఇలాంటి ప్రమాదం ఉంటుంది.

           కాబట్టి డిహైడ్రేషన్ వచ్చి హాస్పిటల్ కి వెళ్లే స్థితి మనకి రాకుండా లూజ్ మోషన్స్ అయినప్పుడు గానీ, వాంతింగ్స్ అయినప్పుడు గానీ లవణం తగ్గకుండా నీరు తగ్గకుండా మనం చేసుకోవాలి. అంటే దానికి ఒకటే మార్గం కొబ్బరి నీళ్లు. సెలైన్ ఎక్కించినప్పుడు లవణాలు వెళ్లి బాడీ అంతా ఎలా రిలాక్సింగా ఉంటుందో కొబ్బరి నీళ్లు తాగినప్పుడు కూడా అలానే ఉంటుంది. ఈ కొబ్బరి నీళ్లను ఒకేసారి తాగేస్తాం. మామూలు వాళ్ళు తాగొచ్చు కానీ కొబ్బరినీళ్ళను మొత్తం లూజ్ మోషన్స్ అయ్యేవాళ్ళు వాంటింగ్స్ అయ్యే వాళ్ళు ఒకేసారి తాగకూడదు. ఒక హాఫ్ గ్లాస్ కొబ్బరి నీళ్ళని 10-15 నిమిషాల పాటు కొద్ది కొద్దిగా తాగాలి.

            అప్పుడు తాగి నీళ్లు తాగినట్లు బ్లడ్ లోకి వెళ్తాయి. దీనివల్ల నీళ్లు రీప్లేస్ అవుతాయి లవణాలు రీప్లేస్ అవుతాయి. ఒక అరగంట పోయేక కావాలంటే గోరువెచ్చని నీళ్లు కొద్ది కొద్దిగా టీ తాగినట్టు తాగాలి. మరలా ఒక అరగంట పోయిన తర్వాత ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళు కొద్ది కొద్దిగా తాగాలి. ఇలా కొబ్బరి నీళ్లను కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తాగాలి. దీనివల్ల ప్రెషర్ ఎక్కువ పడదు కాబట్టి మోషన్స్ కావు వాంతింగ్స్ కూడా రాకుండా ఉంటాయి. ఇంకెప్పుడైనా శక్తి చాలక కళ్ళు తిరిగినట్టు ఉంటే నాలుగు ఐదు స్పూన్ల తేనెను నీటిలో కలుపుకోకుండా నాకితే సరిపోతుంది. ఈ కొబ్బరి నీళ్లలో అన్ని లవణాలు ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ కొబ్బరినీళ్ళను తాగవచ్చు.

             కొబ్బరినీళ్లు రోజు తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఈ కొబ్బరినీళ్ళలో కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉండడం వల్ల ఎముకలు చాలా బలంగా ఉంటాయి.

Leave a Comment

error: Content is protected !!