Fennel seed water will help you lose weight

చిటికెడు జీలకర్రతో బరువు తగ్గి సన్నగా అవ్వాలంటే ఎవ్వరూ చెప్పని బెస్ట్ టెక్నిక్

అధిక బరువు సమస్య ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ అయిపోయింది. కనీసం ముగ్గురిలో ఒకరు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. మారిపోయిన ఆహారపు అలవాట్లు, జీవన శైలి, బిజీ లైఫ్ స్టైల్ అన్నీ కలిసి శరీరంలో కొవ్వును పెంచేస్తున్నాయి. దీని వలన అనేక అనారోగ్య సమస్యలు బారిన పడుతున్నాం. దీని నుండి బయటపడడానికి అనేక వ్యాయామాలు, డైట్లు ఫాలో అవుతూ ఉంటాం. కానీ కొంతమంది మధ్యలోనే వాటిని వదిలేసి ఈ కొత్త పద్ధతి పాటిస్తూ ఉంటారు. 

అలా కాకుండా ఏదైనా ఒక క్రమపద్ధతిలో చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి. బరువు తగ్గడానికి మంచి పోషకాహారం తింటూ వ్యాయామాలు చేస్తూ జంక్ ఫుడ్ కి దూరంగా ఉండటం వల్ల బరువు తగ్గుతారు. దానితో పాటు కొన్ని డీటాక్సిఫై డ్రింక్స్ కూడా బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతాయి. వాటిని ఇంట్లోనే తయారు చేసుకొని వాడడం వల్ల అతి తక్కువ ధర లో బరువు తగ్గవచ్చు.

దాని కోసం ఇప్పుడు మనం ఒక డిటాక్సిఫై డ్రింక్ తయారు చేసుకుందాం. స్టౌపై గిన్నె పెట్టుకొని ఒక గ్లాసు నీళ్లు వేసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ జీలకర్ర, ఒక దాల్చిన చెక్క ఇంచు మొక్క వేసుకోవాలి. ఇప్పుడు నీటిని రంగు మారేవరకు మరిగించాలి.  జీలకర్ర శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడంలో చాలా బాగా సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగు పరిచే ఆహారాన్ని శక్తిగా మారేలా చేస్తుంది. కొవ్వుగా పేరుకోకుండా అడ్డుకుంటుంది.

 దాల్చిన చెక్క మెటబాలిజం రేటును పెంచడంలో చాలా బాగా సహాయపడుతుంది. అవసరమైన జీర్ణరసాలు ఉత్పత్తి చేయడంలో దోహదపడుతుంది. ఈ నీటిని రంగు మారిన తరువాత స్టవ్ ఆపేసి నీటిని వడకట్టుకొని అందులో అరస్పూన్ తేనె కలుపుకోవాలి. కొద్దిగా నిమ్మరసం వేసి సాయంత్రం లేదా పడుకోవడానికి అరగంట ముందు తాగాలి. 

పరగడుపున ఈ డ్రింక్ తాగకూడదు. అలా తాగడం వల్ల గ్యాస్ సమస్యలు పెరుగుతాయి. పడుకోవడానికి ముందు తాగడం వలన తిన్న ఆహారం బాగా జీర్ణం అయి కొవ్వు పేరుకోకుండా ఆపగలదు. తరుచు నీటిని తాగడం వల్ల అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు.

Leave a Comment

error: Content is protected !!