Fenugreek Face Pack For Pimples And Redness

ఐదు నిమిషాలు చాలు తెల్లగా మెరిసిపోతారు

రోజు మనం తీసుకునే ఆహారంలో వాడే పదార్ధాలలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెంతులు రాత్రి నానబెట్టి ఉదయాన్నే నమిలి తినడం వలన శరీరంలో చక్కర స్థాయిని తగ్గిస్తాయి.  రోజూ మెంతులు వ్యాధి తీవ్రతను బట్టి తీసుకోవడం వలన వస్తుంది. అధిక బరువు సమస్య తగ్గుతుంది. గుండె జబ్బులు దరి చేరవు. మలబద్దకం సమస్యను కూడా తగ్గిస్తాయి. మెంతి ఆకుల పేస్ట్ తలకు రాయడం వలన చుండ్రు, జుట్టు రాలడం తగ్గుతుంది.

పాలిచ్చే తల్లులకు మెంతి ఆకుల పేస్ట్ రొమ్ములకు పట్టించడం వలన పాలను ఉత్పత్తి చేసే గ్రంధులు ఉత్తేజితం అయ్యి పాలు పెరుగుతాయి. మెంతులను కూడా ఏదొక రూపంలో ఆహారంలో  తీసుకోవాలి. మెంతి ఆకులు, తులసి ఆకులు కలిపి పేస్ట్ చేసి ముఖానికి రాయడం వలన మొటిమలు,ముడతలు, నల్లని మచ్చలు తగ్గుతాయి.  ఒక  స్పూన్ మెంతులు పరగడుపున తినడం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

చీము గడ్డలు రక్తపు గడ్డలు ఉన్నచోట మెంతులు నానబెట్టి మెత్తగా పేస్ట్ చేసి రాయడం వలన అవి పగిలి వెంటనే తగ్గిపోతాయి. కాళ్ళ పగుళ్ళు ఉన్నచోట గోరింటాకు మెంతులను కలిపి రుబ్బి రాయడం వలన కాళ్ళపగుళ్ళు తగ్గుతాయి. అరికాళ్ళ మంటలు అరిచేతుల మంటలు కూడా తగ్గుతాయి. మెంతులు నానబెట్టి మెత్తగా పేస్ట్ చేసి  ముల్లు గుచ్చుకున్న భాగంలో కట్టు కట్టడం వల్ల చర్మం మెత్తబడి  ముళ్ళు దానంతట అదే బయటకు వచ్చేస్తుంది.

ఒక  వంతు సొంటి పొడి మూడు వంతుల మెంతిపిండి   తేనెతో కలిపి  రోజుకు మూడు సార్లు తీసుకోవడం వలన  కీళ్ళ  నొప్పి, కండరాల నొప్పి, కొలెస్టరాల్ తగ్గుతాయి. నల్ల ఉలవల పొడి, మెంతిపిండి, ముల్లంగి రసం సమభాగాలుగా తీసుకుని రోజుకు మూడు సార్లు కొత్త స్పూన్ చొప్పున తీసుకోవడం వల్ల మూత్రనాళము, మూత్రాశయ లో ఉండే రాళ్లు పడిపోతాయి. ముల్లంగి రసం లేకపోతే ఈ పొడిని నేరుగా తీసుకోవచ్చు.

నల్ల  ఉలవల పొడి, మెంతి పొడి, గంధకచ్చూరాలు, కరక్కాయ పొడి  సమభాగాలుగా తీసుకొని ఒంటికి పట్టించడం వల్ల  శరీరం నుంచి వచ్చే అధిక చెమట దుర్వాసన సమస్య తగ్గుతుంది. మెంతిపొడి, ఉసిరికాయ పొడి, మినుముల పొడి  సమభాగాలుగా తీసుకొని  పొడి మునిగేంత వరకు నిమ్మరసం వేసుకోవాలి. కొద్ది సేపు  నానబెట్టి తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి శీకాకాయ లేదా కుంకుడు కాయతో తలస్నానం చేయడం వలన కుదుళ్ళు గట్టిపడి జుట్టు రాలడం తగ్గుతుంది జుట్టు ఒత్తుగా, పొడవుగా, నల్లగా, చాలా స్మూత్ గా అవుతుంది.

మెంతులు తెల్ల నువ్వులు వాము భాగాలుగా తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని రెండు చెంచాలు రెండు గ్లాసు నీటిలో వేసి అరగ్లాసు  నీళ్ళు మిగిలేలా మరిగించాలి. ఈ కషాయాన్ని రోజుకు మూడుసార్లు తీసుకోవడం వలన నెలసరి సమస్యలు తగ్గుతాయి. మెంతులు తీసుకోవడం వల్ల కొంతమందికి  అజీర్ణం వాంతులు వంటి సమస్యలు ఉంటాయి. అలాంటప్పుడు అల్లం, దానిమ్మకాయ తీసుకుంటే సరిపోతుంది. గర్భంతో ఉన్నప్పుడు మెంతులు వాడకపోవడం మంచిది.

Leave a Comment

error: Content is protected !!