జుట్టు కర్లీగా, రఫ్గా ఉండే వారు జుట్టు మృదువుగా షైనీగా మారడానికి ఒక మంచి హెయిర్ ప్యాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి వాడే పదార్ధాలు అన్నీ మనందరికీ తెలిసినవే. ఈ ప్యాక్ తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. మనం ఏ పదార్థాలు తీసుకోవాలి ఎలా వాడుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనం మూడు స్పూన్ల మెంతులను ఒక గిన్నెలో రాత్రంతా నానబెట్టుకోవాలి. వీటిని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి మెంతులను పక్కన పెట్టుకోవాలి. ఒక్క కొబ్బరికాయని ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని బాగా మిక్సీ పట్టాలి.
ఒక క్లాత్ తీసుకుని అందులో కొబ్బరి గుజ్జు వేసుకోవాలి. దానిని గట్టిగా పిండి కొబ్బరిపాలను సేకరించాలి. మిగిలిన పిప్పిలో అరగ్లాసు నీటిని వేసి మళ్లీ మిక్సీ పట్టాలి. మళ్లీ దీనిని పిండితే కొబ్బరి పాలు వస్తాయి. మిగిలిన పిప్పి ఎందుకూ పనిచేయదు. పడేయవచ్చు. ఒక జార్లో మెంతులను వేసుకొని దాంట్లో కొద్దికొద్దిగా కొబ్బరిపాలను వేస్తూ మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఎక్కడా రవ్వ ఉండకుండా మెత్తగా చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి ముప్పై నుండి నలభై నిమిషాల పాటు ఆరనివ్వాలి. కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. అందుబాటులో లేని వారు మీరు వాడే షాంపూ ఉపయోగించవచ్చు. మెంతి గింజలు ఇనుము మరియు ప్రోటీన్ యొక్క గొప్ప మూలం. ఇవి రెండూ జుట్టు పెరుగుదలకు అవసరమైన రెండు పోషకాలు. అవి ఫ్లేవనాయిడ్లు మరియు సపోనిన్‌లతో సహా మొక్కల సమ్మేళనాల యొక్క ప్రత్యేకమైన కూర్పును కూడా కలిగి ఉంటాయి. ఈ సమ్మేళనాలు వాటి శోథ నిరోధక మరియు యాంటీ ఫంగల్ ప్రభావాల కారణంగా జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి
కొబ్బరి పాలు యొక్క సహజ కొవ్వు ఆమ్ల ప్రొఫైల్ తీవ్ర తేమ ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇవి పొడి జుట్టు మరియు శిరోజాల రెండింటినీ పునరుద్ధరించగలవు, దెబ్బతిన్న జుట్టుకు కూడా శక్తివంతమైన కండీషనర్‌గా పనిచేస్తాయి. జుట్టును మృదువుగా మెరిసేలా చేస్తాయి. కుదుళ్ళనుండి బలంగా మారి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి.