మన నిత్యజీవితంలో ఎదురయ్యే చాలా ఆరోగ్య సమస్యలకు మనం తీసుకునే ఇంగ్లీష్ మందులకు ప్రత్యామ్నాయం మన ఇంట్లోనె ఉందని మనందరికీ తెలుసు.ఇంగ్లీష్ మందులు వాటివలన వచ్చే దుష్ప్రభావాలు తెలిసినా కానీ మనకి కావలసిన సత్వర పరిష్కార మార్గాలను అన్వేషించడంలో అందుబాటులో ఉన్న అద్బుతమైన ఔషధాలు మరుగునపడిపోతున్నాయి. మనలో చాలామందికి ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు ఘగర్,థైరాయిడ్,గుండె జబ్బులు,జుట్టురాలడం,చర్మం కళావిహీనంగా మారడానికి మన రక్తంలోని మలినాలే కారణమని మీకు తెలుసా.
సరైన జీర్ణక్రియ జరగక మలబద్దకంతో ఏర్పడే ఈ మలినాలు మన రక్తంలో కలిసి అనేక సమస్యలకు కారణమవుతాయి. వీటికి మన ఇంటివైద్యంలో సరైన మందు మెంతులు. మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయం పరగడుపున ఆ నీరు తాగేసి మెంతులను నమిలి తినడంవలన మెంతులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు,ఫైబర్ వలన జీర్ణక్రియ సక్రమంగా జరిగి రక్తం శుద్ది అవుతుంది.అలాగే మెంతులను పొడిలా చేసి గోరువెచ్చని నీటిలో కలిపి తాగడంవలన రక్తశుద్ది జరిగి సగం రోగాలను రాకుండా చేయగలదు.
గుండె జబ్బులకు కారణమయ్యే రక్తంలో ఉండే కొవ్వును తగ్గించి ,రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. చక్కెర వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. శరీరభాగాలకు అవసరమైన రక్తప్రసరణ జరిగి చర్మం కొత్తకళను సంతరించుకుంటుంది.చర్మంపై ఏర్పడే మచ్చలు తగ్గిస్తుంది. స్త్రీ లలో అనేక గర్భాశయ వ్యాధులకు ,పునరుత్పత్తి , హార్మోనల్ ఇన్బాలన్స్ వంటి నేడు ఎక్కువగా దాడిచేస్తున్న స్త్రీల వ్యాధులకు మంచి ఫలితాలు చూడొచ్చు.
జుట్టులో చుండ్రు చేరినప్పుడు పెరుగుతో పాటు మెంతులు నానబెట్టి రుబ్బి ఆపేస్ట్ తలకి పట్టించడం వలన చుండ్రు తగ్గి,జుట్టుకి మంచి కండిషనర్‌లా ఉపయోగపడుతుంది. చలికాలంలో తేమను కోల్పోయి చిట్లే జుట్టుని ఆరోగ్యవంతంగా మార్చి రాలడం తగ్గిస్తుంది ఇలా అనేకవిధాలుగా ఉపయోగపడి మనకి పూర్వపు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే మెంతులను అలక్ష్యం చేయకుండా రోజువారీ ఆహారపు అలవాటుగా మార్చేసుకుందామా మరి.
గమనిక : ఈ వెబ్ సైట్ లో పెడుతున్న వివరాలన్నీ పాఠకుల ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా పాఠకుల అవగాహన పెంచడానికి మాత్రమే ..ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు
Sir send me Piles remedies
నా పేరు ” శ్రీశైలంజగదీష్ “, నేను గత 8సంవత్సరముల నుండి ” మూర్ఛ ” రోగం నుండి భాద పడుతున్నాను, కొంచెం దాని నుండి విముక్తి కలిగించే సూచనలు చెప్పండి సార్…..
Good information for health thank you 💐💐👌🤝
Pl send me solution for d treatment of small fissur and piles