Festival Special Chintakaya Pulihora

హెల్దీ చింతకాయ పులిహోర ఇక ఆరోగ్యమే ఆరోగ్యం…

చింతపండుతో పులిహోర చేస్తే ఉప్పులేని లోటు ఎక్కువ తెలుస్తుంది.  దీనివల్ల వేడి చేసినట్టు రకరకాల ఇబ్బందులు కలుగుతాయి. అలాంటి హానిలేని విధంగా పచ్చి చింతకాయతో చింతపండు పులిహార ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. చింతకాయ పులిహారకు కావలసిన పదార్థాలు ముందుగా బాస్మతి బియ్యం వన్ కప్, కొబ్బరి పాలు వన్ కప్, చింతకాయ ముక్కలు వన్ కప్, ఖర్జూరపు ముక్కలు పావు కప్, వేపించిన వేరుశనగ పప్పులు, పావు కప్పు, పచ్చిమిర్చి ముక్కలు పావు కప్పు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్, నువ్వుల పొడి టూ టేబుల్ స్పూన్, మీగడ వన్ టేబుల్ స్పూన్, పసుపు కొద్దిగా, ఇంగువ కొద్దిగా, కరివేపాకు కొద్దిగా తీసుకోవాలి.   

           ముందుగా ఒక పాత్రలో బాస్మతి బియ్యం వేసి కొబ్బరిపాలు వన్ కప్, వన్ కప్ నీళ్ళ తో ఉడికించుకోవాలి. ఇలా కుతకుత లాడుతూ ఉడికిన బాస్మతి రైస్ ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దానిలో చింతకాయ ముక్కలను వేసి పచ్చి మిరపకాయ ముక్కలు కూడా వేసి ఖర్జూరం కూడా కలిపి మిక్సీ పట్టుకోవాలి. పచ్చి చింతకాయ పేస్టు మెత్తగా రెడీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని దానిలో వన్ టేబుల్ స్పూన్ మీగడ వేసి ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకుని బాగా వేపుకోవాలి. వేరుశనగకాయ గుళ్ళు, పచ్చిమిర్చి ముక్కలు, ఇంగువ, కరివేపాకు, పసుపు ఇవన్నీ మీగడ లో బాగా ఫ్రై చేసుకోవాలి.

            తర్వాత దీనిలో పచ్చి చింతకాయ పేస్ట్ ని కూడా వేసి బాగా వేపుకోవాలి. దీని పచ్చి వాసన పోయేంతవరకు వేపుకుని దీనిలో ఉడికించిన బాస్మతి రైస్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మెంతి పొడి, నువ్వుల పొడి వేసి కలుపుకోవాలి. వీటి యొక్క కాంబినేషన్ పులిహార ఉప్పు లేకపోయినా రుచిగా ఉంటుంది. తర్వాత కొత్తిమీర చల్లి రెడీ చేసుకోవాలి. పులిహారలో సాధారణంగా నువ్వుల పొడి వేరుశనగపొడి పెద్దగా వాడరు. కానీ ఇలా వాడటం వల్ల ఉప్పు లేని లోటు తెలియదు. చింతపండుకు బదులు చింతకాయలను వాడడం వల్ల మేలు జరుగుతుంది ఎసిడిటీ భారీ నుండి ఉపశమనం పొందవచ్చు. దీని శాస్త్రీయ నామం టామరిండస్ ఇండికా.

             ఇలాంటి హెల్దీ వేలో పులిహార తయారు చేసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు.

Leave a Comment

error: Content is protected !!