ఒంట్లో నీరసం లేదా జ్వరం ఉన్నప్పుడు డాక్టర్లు కొన్నిసార్లు మందులతో పాటు గ్లూకోజ్ పౌడర్ కూడా రాస్తుంటారు. గ్లూకోజ్ నీటిలో కలపగానే ఒక చల్లటి అనుభూతి వస్తుంది. అలాగే గ్లూకోజ్ తాగగానే వెంటనే శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది. కొంతమంది ఇంట్లో అయితే పిల్లలు గ్లూకోజ్ తింటూ ఉంటారు. ఇంతకీ గ్లూకోజ్ దేనితో తయారు చేస్తారు. దీనిని తాగడం వలన లాభమా నష్టమా.?
గ్లూకోజ్ ను పంచదారతో తయారు చేస్తారు. పంచదారను కొన్ని కెమికల్ రియాక్షన్స్ వలన అది తాగినపుడు చల్లటి ఫీలింగ్ వస్తుంది. అంతేకాకుండా గ్లూకోజ్ తాగినపుడు ఎంత శక్తి వస్తుందో పంచదార నీటిలో కలిపి తాగినా అంతే శక్తి వస్తుంది. శక్తి వస్తుంది కదా పంచదార తరుచూ తీసుకోం ఎందుకంటే పంచదార వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే బ్లూటూత్ ఆగినప్పుడు కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
గ్లూకోజ్ కంటే కూడా తేనె వాడటం చాలా మంచిది ఇంతకు ముందు కాలంలో అందరికీ అందుబాటులో ఉండేది కాదు ఇప్పుడు చాలా బ్రాండ్లు అమ్మడం వలన అందరికీ అందుబాటులో లభిస్తుంది. ఇది నీటిలో కలుపుకుని తాగడం వలన తక్షణ శక్తిని ఇవ్వడంతోపాటు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. తేనెలోని యాంటీఆక్సిడెంట్ మరియు ఫ్రీ రాడికల్స్‌ను అడ్డుకుంటుంది. జీర్ణవ్యవస్థను, కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ ద్వారా రిఫ్లక్స్ కొంతవరకు సంభవించవచ్చు. ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడం ద్వారా తేనె ఈ నష్టాన్ని నివారించవచ్చు. అన్నవాహికలో మంటను తగ్గించడానికి తేనె పని చేస్తుంది.
అందుకే ఎప్పుడైనా నీరసం అనిపించినపుడు కొంచెం నీటిలో ఆర్గానిక్ తేనె కలుపుకుని తాగండి. ఇది శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే దీనివలన పంటికి నోటికి జీర్ణవ్యవస్థకు ఎటువంటి హాని ఉండదు. గట్ బ్యాక్టీరియా ను కాపాడడంతో పాటు నిమ్మరసంతో కలిపి తీసుకుంటే అధిక బరువు సమస్య తగ్గించి , శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయపడుతుంది. దీనివలన కిడ్నీ, లివర్ వంటి అవయవాలు కూడా శుభ్రపడి ఎన్నో ఆరోగ్య సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.