ఒరిగానో అనేది మంచి సువాసనకు, పదార్థాలకు రుచిని అందిస్తుంది. పిజ్జాల్లో పైన చల్లుతూ ఉన్నారు, ఇంకా కొన్ని ఫాస్ట్ ఫుడ్ లో కూడా దీనిని బాగా వాడుతున్నాను. దీనివల్ల సైంటిఫిక్ గా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముందుగా ఒరిగానో ఉండే పోషకాలు 100 గ్రాముల 306 క్యాలరీల ఎనర్జీ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ 64 గ్రాములు, ప్రోటీన్ 11 గ్రాముల ఫ్యాట్ 10 గ్రాముల ఫైబర్ 43 గ్రాముల ఇవి స్థూల పోషకాలు. సూక్ష్మ పోషకాలు విషయానికి వస్తే కాల్షియం నువ్వుల కంటే చాలా ఎక్కువగా ఉంది. 100 గ్రాములు నువ్వులలో1450 mlg కాల్షియం ఉంటే ఈ ఒరిగానో మాత్రం1526 mlg కాల్షియం ఉంటుంది.
అంటే మనకు ఒక రోజుకి 450 mlg కాల్షియం సరిపోతుంది. పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంది, 1670 mlg పొటాషియం, విటమిన్ C 50 mlg ఉంటుంది. ఈ వరిగానంలో 12 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, వీటితోపాటు కార్వకాల్ మరియు తైమొల్ అనే రెండు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కలిసి శరీరంలో ఇన్ఫెక్షన్ అయినా బాగా స్పీడ్ గా తగ్గించడానికి ఈ ఒరిగానో అద్భుతంగా ఉపయోగపడుతుంది. లంగ్స్ లో ఇన్ఫ్లమేషన్ కలుగుతుంది, కఫం, ఇన్ఫెక్షన్ లాంటివి వస్తూ ఉంటాయి. దెబ్బలు, గాయాలు, ఆపరేషన్ అయినా ఈ ఒరిగానో ఉపయోగిస్తే 60% ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.
2012 లో ఫెడరల్ యూనివ్సిటీ ఆఫ్ పియ్యో బ్రెజిల్ దేశం వారు పరిశోధన చేసి ఎలుకల పైన ఈ ఒరిగానో ఉపయోగించి వాటిలో 55-60% ఇన్ఫ్లమేషన్ తగ్గిపోయింది. కొన్ని ఎలుకలకి ఒరిగానో వాడి చూస్తారు, కొన్ని ఎలుకలకి వేరే మందులు వాడతారు, కొన్ని వాటికి ఏమీ వాడకుండా అలా ఉంచుతారు. ఇలా ఎంత ఇన్ఫ్లమేషన్ పర్సంటేజ్ ఉందో పరిశోధన చేశారు. 23 బ్యాక్టీరియాలు ఒరిగానో వాడడం వల్ల చనిపోతున్నాయని ఈ పరిశోధన ద్వారా తెలిసింది. దీనిలో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ క్యాన్సర్ గా ఉపయోగపడి శరీరంలో విడుదల అయ్యే ఫ్రీ రాడికల్స్ ని తగ్గిస్తుంది.
ముఖ్యంగా ఈ ఒరిగానో లో ఉన్న ఒక పోషకం ఫైబర్. దీనిని పొడిగా వేసుకోవచ్చు చాలామంది జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ తినేవారు దీనిని పైన చల్లుకుని తింటున్నారు దీనివల్ల ఎక్కువ ఫైబర్ శరీరానికి అందుతుంది. ఈ ఫైబర్ శరీరంలోకి వెళ్లి ప్రోబయోటిక్ గా ప్రేగుల్లో హెల్ప్ ఫుల్ బ్యాక్టీరియాలను బాగా పెంచడానికి ఉపయోగపడుతుంది.