సాధారణంగా మనం వేసుకునే చిల్లాలు అన్ని జీరో ఫైబర్, జీరో ప్రోటీన్ తెల్లటి పిండి ఉండే కార్బోహైడ్రేట్స్ తో కూడినవి. వీటి వలన మనకు నష్టమే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం తయారు చేసుకునే పెసరపప్పు ఓట్స్ తో తయారు చేసిన చిల్లా చాలా ఆరోగ్యకరమైనది. ఇందులో ఉపయోగించే పెసరపప్పు అంటే హై ప్రోటీన్, మరియు ఓట్స్ అంటే హై ఫైబర్. కనుక ఈ రెండిటికి కాంబినేషన్లో చేసుకునే చిల్లా పేగులను క్లీన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా స్మూత్ గా, మెత్తగా ఉంటుంది. మరియు చాలా బలాన్ని చేకూరుస్తుంది.
అటువంటి ఆరోగ్యకరమైన చిల్లా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాం. పెసరపప్పు ఓట్స్ చిల్లా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా నానపెట్టిన పెసలు ఒక కప్పు, నానబెట్టిన ఓట్స్ ఒక కప్పు, పెరుగు ఒక కప్పు, క్యారెట్ ముక్కలు పావు కప్పు, టమాటా చిన్న ముక్కలు పావు కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు పావు కప్పు, క్యాప్సికం చిన్న ముక్కలు పావు కప్పు, నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, అల్లం తురుము ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా.
ఇప్పుడు చిల్లా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో జీలకర్ర, అల్లం తురుము, పచ్చిమిరపకాయ తురుము, నానబెట్టిన ఓట్స్, నానబెట్టిన పెసలు, పుల్లటి గట్టి పెరుగు వేసి వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, క్యాప్సికం ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర, మిరియాల పొడి కొద్దిగా వేసి ఇందులో మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. చిల్లా పిండిలా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక నాన్ స్టిక్ పాన్ పైన దోస లాగా వేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత మరొకవైపు తిప్పుకోవాలి. కావాలి అనుకుంటే కొంచెం మిగడ రాసుకోండి. ఇందులో పెసలు, ఓట్స్ ఉండడం వలన మెత్తగా గుల్లగా వస్తాయి. ఇందులో క్యాప్సికం, టమాటాలు, పచ్చిమిర్చి అన్ని రకాలు ఉండడం వలన మంచి రుచికరంగా ఉంటాయి. మరియు నిమ్మరసం పిండుకొని వేడివేడిగా తింటుంటే చాలా రుచిగా ఉంటుంది…