చాలా సందర్భాల్లో కవుకు దెబ్బలు అనే మాట వింటూ ఉంటాం. అంటే పైకి దెబ్బ కనబడకుండా తగిలే దెబ్బలని అర్థం. ఇవి పైకి దెబ్బ లేకపోయినా లోపలి కండరాలు, ఎముకలు కలిగించే నొప్పి అలవికాదు. ఈ నొప్పిని కవుకు దెబ్బల తీపు అని కూడా అంటారు. అయితే దెబ్బలేవీ తగలకుండా కండరాలు ఎక్కడివక్కడ పట్టుకుపోయినట్టు బాధపెట్టే వ్యాధిని ఫైబ్రోమయాల్జియా అంటారు. ఇది తాత్కాలికంగా వచ్చినట్టు అనిపించినప్పటికి, ఒకోసారి దీర్ఘవ్యాధిగా కూడా మారిపోతూ ఉంటుంది.
దీని లక్షణాలు:
◆వ్యక్తుల్లో ఒకవిధమైన నిస్త్రాణం అవహిస్తుంది.
◆ఏదైనా ఒక శరీరభాగం నొప్పితో బిగుసుకుపోయినట్లు అనిపించడం.
◆తలనొప్పి గా ఉండటం.
◆నిద్రాభంగం- ఏదో ఒక నిర్ణీత సమయానికి మెలకువ వచ్చి తరువాత నిద్రపట్టక పోవడం.
◆మానసికంగా దిగులు, ఆందోళన మరియు దుఃఖంగా అనిపించడం.
◆శరీరంలో ఏదైనా కండర భాగం వాచిపోవడం.
◆తిమ్మిర్లుగా అనిపించడం
వంటి పై లక్షణాలు తరచూ కనిపించినపుడు వైద్యుడి సలహా తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని మాంసావృత వాతవ్యాది అంటారు. వాతదోషం వికటించి, మాంస కండరాలను ఆవరించి, నాడీవ్యవస్థను ఒకవిధమైన అతి స్పందనలు కలుగచేస్తుంది. అంటే గోరు గుచ్చుకుంటే మేకు దిగినంత బాధ ఉంటుంది. వాతదోషాలను అదుపులో పెట్టుకోవడమే దీనికి చికిత్స, శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడం కూడా కండరాల నొప్పులకు ప్రధానం కారణం కావచ్చు.
ఈ నొప్పులకు కారణాలు:
◆శరీరానికి సరిపడని ఆహారాధార్థాలు తీసుకున్నప్పుడు నొప్పులు పెరుగుతాయి.
◆పెరుగన్నం తిన్నా తరువాత టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. కానీ ఇవి రెండూ విరుద్ధమైన ఆహారపదార్థాలు. ఇలాంటి విరుద్ధ పదార్థాలు తీసుకున్నప్పుడు కూడా నొప్పులు పెరుగుతాయి.
◆జీవనసరళి లో మార్పు, సమయాలు పాటించకపోవడం కూడా ఒక కారణం.
◆శారీరక శ్రమను అనుసరించి ఆహారం తీసుకోకుండా ఆహారం ఎక్కువ శారీరక శ్రమ తక్కువ వుండటం కూడా కారణం అవుతుంది.
◆అతిగా ఉపవాసాలు, ఆకలి చంపుకోవడం వలన కీళ్లనొప్పులు వస్తాయి.
◆అలవాటు లేని బరువు పనులు చేయాడ్స్మ్ వలన నొప్పులు వస్తాయి. గతం లో ఉన్న నొప్పులు తిరగబెడతాయి. అలాగే విరామం లేకుండా ప్రయాణాలు చేయడం కూడా కారణం.
◆దిగులు లేక ఆందోళనలు, మనిషిలో రకరకాల వ్యాధులు రావడానికి కారణం అవుతాయి. మైగ్రేన్, కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్, మలబద్దకం, కీళ్లనొప్పులు, నడుం నొప్పి వంటివన్నీ దిగులు, ఆందోళన వలన తిరగబెడుతూ ఉంటాయి. ఈ మానసిక సమస్యలు తగ్గితే శరీరం ఆరోగ్యం గా ఉంటుంది.
చివరగా….
పెయిన్ చెప్పుకున్న కండరాల జబ్బు తగ్గాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, జీవన శైలి, అలవాట్లు మొదలైనవి అనుసరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి పాటించి ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి