Flax Seeds for Weight Loss in Telugu Flax Seeds Powder for Healthy Weight Loss

వేలాడే పొట్టను సైతం కరిగించి కడుపు, నడుమును సన్నగా నాజూగ్గా చేసే అద్భుతమైన చిట్కా!!

అందంగా కనిపించాలని చాలామంది అనుకుంటారు. బోలెడు స్టైల్స్ లో ఉన్న దుస్తులు వేసుకోవాలని ఉవ్విళ్లూరుతారు. కానీ వేసుకోవడానికి ఇబ్బంది, వేసుకున్నా వికారంగా కనిపించడం వంటి సమస్యలు మానసికంగా కృంగిపోయేలా చేస్తాయి.  చాలామందిలో ఎక్కువగా కనిపించే సమస్య పొట్ట, నడుము, పిరుదుల స్థానంలో విపరీతంగా కొవ్వు పెరిగిపోవడం. ఆహార అలవాట్లు, శరీర శ్రమ లేకపోవడం, సమయవేళలు పాటించకపోవడం వంటివెన్నో కారణాలు కావచ్చు కానీ. సమస్య మాత్రం సతాయిస్తుంది. అయితే ఇంట్లో లభించే వాటితోనే కొవ్వును ఐస్ లా కరిగించి నడుము, పొట్ట పిరుదులు సన్నబడేందుకు అద్భుతమైన చిట్కా మీకోసం ఇప్పుడు.

కావలసిన పదార్థాలు:

●అవిశే గింజలు

●వేడి నీళ్లు

●మిరియాల పొడి

●అల్లం పొడి

●నిమ్మరసం

●తేనె.

తయారీవిధానం:

ముందుగా అవిశే గింజలను రాత్రిపూట నీళ్లలో వేసి ఉంచాలి. ఉదయం కు అంతా అవి తాజాగా మారిపోతాయి.  ఒక గ్లాసు వేడి నీళ్లు తీసుకుని అందులో ముందురోజు రాత్రి నానబెట్టిన అవిశే గింజలను వేయాలి. గ్లాసు మీద మూతపెట్టి దాదాపు ఇరవై నిమిషాల పాటు ఒకపక్కగా ఉంచాలి.  ఇరవై నిమిషాల తరువాత నీటినుంది అవిశేగింజలను వడగట్టి వేరు చేయాలి. ఈ నీటిలో చిటికెడు మిరియాల పొడి, చిటికెడు అల్లం పొడి, ఒక స్పూన్ నిమ్మరసం మరియు ఒక స్పూన్ తేనె వేసి బాగా కలిపి రోజు ఉదయాన్నే కాళీ కడుపుతో తాగాలి. ఇలా చేయడం వల్ల కడుపు, నడుము, పిరుదుల భాగాల్లో పేరుకున్న కొవ్వు మొత్తం మంచులాగా కరిగిపోతుంది. 

◆అవిశే గింజల్లో ఒమేగా 3, నీటిలో కరిగే విటమిన్లు కూడా ఉంటాయి. నీటిలో నానడం వలన ఈ విటమిన్లు శరీరానికి అందుతాయి. అలాగే వీటికి శరీరానికి వేడి పుట్టించే గుణం ఉంటుంది కాబట్టి  శరీరంలో కొవ్వును సులువుగా కరిగించగలదు. 

◆వేడి నీళ్లు ఆరోగ్యరీత్యా ఎంతో గొప్ప ఔషధం. పరగడుపున వేడి నీళ్లు తాగడం అనేది జీర్ణశక్తిని, శరీరంలో పేరుకున్న కొవ్వును, మలినాలను సమర్థవంతంగా తొలగించడంలో సహాయపడుతుంది.

◆మిరియాలు ఒంట్లో వేడిని పుట్టించి శరీరంలోని అదనపు కొవ్వును కరిగిస్తాయి. పరగడుపున తీసుకోవడం వల్ల ఈ చర్య మరింత వేగంగా ఉంటుంది.

◆అల్లం గురించి మనకు తెలిసినదే మంచి జీర్ణశక్తిని మరియు వేడిని పుట్టించే గుణం కలిగి ఉంటుంది. ఇది కూడా శరీరంలో కొవ్వును ఆసాంతం కరిగించేయగలదు.

◆నిమ్మరసం. ఇందులో విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి శరీరంలోని కొలెస్ట్రాల్ ను సునాయాసంగా కరిగించడంలో తోడ్పడుతుంది.

◆తేనె గూర్చి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఉదయాన్నే తేనె కలిపిన వేడి నీటిని తాగేవాళ్ళు బోలెడు మంది. రోజు మొత్తం చురుగ్గా, మెదడును చలాకీగా ఉంచేలా చేస్తుంది తేనె. అలాగే సహజమైన చెక్కెరలు కాబట్టి ఎలాంటి హాని ఉండదు. 

చివరగా……

వీటన్నిటి కలయిక  శరీరంలో ఉన్న అదనపు కొవ్వును, ఎక్కడికక్కడ కరిగించి సారీడం సన్నబడేలా ముఖ్యంగా కడుపు, నడుము వంటి ప్రాంతాలను నాజూగ్గా మార్చడంలో గొప్పగా సహాయపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం అన్ని వంటింట్లో దొరికే వీటితో వండర్ చేసి మీ పొట్టను తగ్గించేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!