కొంతమంది ఏ చిన్న పని చేసిన అలసట, త్వరగా నీరసించిపోవటంవంటివి జరుగుతుంటాయి. శరీరానికి తగిన శక్తి అందకపోవటమే దీనికి కారణం. ఐరన్ వంటి ఖనిజాలు లోపం ఏర్పడితే దీర్ఘకాలంలో రక్తహీనత కూడా ఏర్పడవచ్చు. పిల్లలు సన్నగా, బలహీనంగా ఉన్నా ఆహారంలో చేసే చిన్న చిన్న మార్పులు వారిని బలంగా తయారుచేస్తాయి. దానికి మనం తీసుకోవలసిన పదార్థాలు ఖనిజాలతో నిండి ఉండాలి మరియు తక్షణ శక్తిని అందించాలి. దాని కోసం ఈరోజు మనం ఒక లడ్డు తయారు చేయడం గురించి తెలుసుకుందాం. ఇది శక్తిని అందించడంతో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది.
ఈ లడ్డు తయారు చేయడానికి మనకు కావలసిన పదార్థాలు అవిశె గింజలు ఒక కప్పు (ఫ్లాక్ సీడ్స్) వీటిని నూనె లేకుండా వేయించాలి. తర్వాత ఒక కప్పు నువ్వులు తీసుకోవాలి. నువ్వులను కూడా ఇదే పాన్‌లో వేసి వేయించాలి. ఇవి వేగాయని తెలియడానికి కొంచెం చిటపటలాడతాయి. తర్వాత స్టవ్ ఆపేసి వీటిని చల్లార్చాలి.
వీటిని మిక్సీలో మెత్తని పొడిలా చేసుకోవాలి. తర్వాత బెల్లాన్ని తురుముకోవాలి. అలాగే పది, పదిహేను బాదంపప్పు లను తీసుకుని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత బెల్లాన్ని స్టవ్‌పై పెట్టి కొంచెం నీళ్ళు వేసుకోవాలి. ఇది తీగ పాకం వచ్చేవరకు ఉంచాలి. తర్వాత ఇందులో అవిశె గింజలు, నువ్వుల పొడిని వేసుకోవాలి.
ఇందులో తరిగి పెట్టుకున్న బాదంపప్పు కూడా వేసుకోవాలి. ఇది దగ్గరకు వచ్చేంతవరకు ఉంచి తర్వాత మంట కట్టేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలా చుట్టుకోవాలి. ఇవి రోజుకు ఒకటి తినడం వలన సత్వర శక్తిని అందించడమే కాకుండా రక్తహీనత, నడుం నొప్పి, కీళ్ళనొప్పులు తగ్గుతాయి.
అవిసె గింజలను పోషకాలతో నిండి ఉంటాయి. ఫ్లాక్స్ సీడ్స్‌లో ఒమేగా -3 కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. శాఖాహారులకు ఇది ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లోపాలను సరిచేస్తుంది. అవిసె గింజలలో లిగ్నన్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. అవిశెగింజలు డైటరీ ఫైబర్ రిచ్ గా ఉంటాయి . అవిసె గింజలు మంచి కొలెస్ట్రాల్‌ను మెరుగుపరుస్తాయి. అవిసె గింజలు రక్తపోటును తగ్గిస్తాయి. ఇవి అధిక-నాణ్యత కల ప్రోటీన్‌ను కలిగి ఉంటాయి.
నువ్వులు ఫైబర్ యొక్క మంచి మూలం. ఇవి కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గిస్తాయి. నువ్వులు మొక్క ఆధారిత ప్రోటీన్ యొక్క పోషకమైన మూలం. రక్తపోటు తగ్గించడానికి సహాయపడవచ్చు. ఆరోగ్యకరమైన ఎముకలకు సహాయం చేయవచ్చు. శరీరంలో మంటను తగ్గించవచ్చు. నువ్వులు బి విటమిన్లకు మంచి మూలం. అంతేకాకుండ రక్త కణాల నిర్మాణానికి సహాయపడతాయి.
ఇక బెల్లం ఇనుము లోపాన్ని సవరించడమే కాకుండా శరీరమంతా నిర్విషికరణ చేసి శుభ్రపరుస్తుంది. మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తహీనతను నివారిస్తుంది. రోగనిరోధక శక్తి పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తంలో ఎయిడ్స్ గ్లూకోజ్ నియంత్రించడం మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
బాదంపప్పులు ఆహారంలో తీసుకోవడం వలన భారీ మొత్తంలో పోషకాలను అందిస్తాయి. బాదంపప్పులు యాంటీఆక్సిడెంట్లతో లోడ్ చేయబడిఉంటాయి. బాదంపప్పులలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణతో బాదం సహాయపడుతుంది. మెగ్నీషియం, రక్తపోటు స్థాయిలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. బాదం రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగలదు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ లడ్డూ రోజుకొకటి తినడంవలన పిల్లలు, పెద్దలలో అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందుకుంటారు.