ఫ్లాక్స్ సీడ్ లేదా అవిసె గింజలు జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహాయపడుతాయి. వీటి నుండితయారు చేసిన జెల్ జుట్టు మెరిసేందుకు మరియు ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది. సహజమైన జుట్టును మెరిసేలా మరియు చిగుళ్ళు చిట్లకుంగా ఉంచడానికి మనం సంవత్సరాలుగా ఉపయోగించిన అనేక ఉత్పత్తులు విపరీతమైన రసాయనాలను కలిగి ఉన్నాయి, ఇవి జుట్టు పెరుగదలకి, విచ్ఛిన్నానికి లేదా రెండింటికి కారణమయ్యాయి. అవిసె గింజ జెల్ యొక్క ప్రయోజనాలను దానిని మన దినచర్యలో భాగం చేయడం వలన సహజమైన జుట్టు సంరక్షణలో సహాయపడతాయి. మీరు కూడా ఉపయోగించడానికి ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి:
ఎండినట్టు ఉన్న జుట్టును నియంత్రిస్తుంది
అవిసె గింజ జెల్ ఉపయోగించడం వల్ల మీ జుట్టుకు హాని జరగకుండా ఫ్రిజ్ ను తగ్గించుకుంటారు. అంతేకాకుండా ఇది మీ జుట్టును బలపరుస్తుంది. జిడ్డు అవశేషాలను తలపై వదిలివేయదు.
జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది
మీ జుట్టు పెరుగుదలకు అతిపెద్ద అంశం మీ తలలోని చర్మం యొక్క ఆరోగ్యం. అవిసె గింజల్లో విటమిన్ బి, మెగ్నీషియం, మాంగనీస్, సెలీనియం మరియు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి తలమీద చర్మ చికిత్సకు, జుట్టు రాలడాన్ని నివారించడానికి మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఫ్లాక్స్ సీడ్ జెల్ తో చర్మ కణాలను ఆరోగ్యంగా చేసి జుట్టును చిక్కగా మరియు పొడవుగా పెరగడానికి ప్రేరేపిస్తాయి.
మీ జుట్టుకు తేమ మరియు నిగనిగలాడే షైన్‌ని జోడిస్తుంది.
పెళుసుదనాన్ని తగ్గిస్తుంది
జుట్టు చివరలు పెళుసుగా ఉంటే, విచ్ఛిన్నం లేదా పగులుతూ ఉంటుంది. మీ జుట్టు యొక్క స్థితిస్థాపకతను మెరుగుపరచడం కీలకం. జెల్ ను రూట్ నుండి జుట్టు చివర వరకు అప్లైచేయడం ద్వారా, మీరు క్యూటికల్ ను మూసివేసి, విచ్ఛిన్నం కాకుండా కాపాడుతారు.
ఎక్కడ దొరుకుతుంది
చాలా కంపెనీలు తమ సొంత బ్రాండ్ ఫ్లాక్స్ సీడ్ జెల్ ను అమ్ముతాయి. అవిసె గింజల నుండి ఉత్తమ ప్రయోజనాలను పొందడానికి ఎక్కువ పదార్థాలు లేని జెల్స్ కోసం చూడొచ్చు. లేదా జెల్ ను మీరే సొంతంగా తయారు చేసుకోవాలనుకుంటే సూపర్ మార్కెట్లో ఆన్లైన్ షాపింగ్ లో వీటిని కొనుక్కోవచ్చు..
అవిసె గింజల జెల్ తయారు చేయడం చాలా సులభం. మీకు కావలసిందల్లా అవిసె గింజలు, నీరు, ఒక చిన్న గిన్నెలో 2 కప్పుల నీటిని, 2 కప్పుల విత్తనాలను పోయాలి. సుమారు 10 నిమిషాలు వీటిని ఉడకనివ్వండి. ఇవి మరుగుతుంటే నురగలు పైకి వస్తాయి. కలుపుతూ ఉండాలి. నీళ్ళు జెల్ ఫాంలోకి రాగానే స్టవ్ ఆపేసి నీటిని ఒక పలచని గుడ్డలో వేసి వడకట్టాలి. చల్లారితే జెల్ బయటకు రావడం కష్టమవుతుంది.
వేడి చల్లబడిన తర్వాత ఈ జెల్ చిక్కగా ఉంటుంది. వీలైనంత జెల్ను వేరు చేయండి. ఈ జెల్ ను తలకి కుదుళ్ళ నుండి జుట్టు చివర్ల వరకు అప్లై చేయాలి .
ఇలా ఒక ఇరవై నిమిషాలు వదిలేసి మామూలు నీటితో లేదా మైల్డ్ షాంపూతో కూడా శుభ్రం చేసుకోవచ్చు. దీనిని 15 రోజులు లేదా నెలకు ఒకసారి ప్రయత్నించడం వల్ల జుట్టు మృదువుగా, మెరుస్తూ తయారవుతుంది. అంతేకాకుండా కుదుళ్ల నుంచి బలంగా, దృఢంగా తయారయ్యి జుట్టు పగుళ్ళు వంటి సమస్యలు తగ్గిపోతాయి.